రైలు మార్గం ద్వారా వలస కూలీల తరలింపు..! హైదరాబాద్ నుండి ఝార్ఖండ్ బయల్దేరిన రైలు బండి..!!
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని కట్టడిచేయడంలో ఎదుర్కొంటున్న సమస్యకంటే రెట్టింపుగా వలస కార్మికుల తరలింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. జీవనోపాది కోసం దేశంలో వివిధ రాష్ట్రాలకు చేరుకున్న రెండు తెలుగు రాష్ట్రాల వలస కూలీల వెతలు అన్నీ ఇన్నీ కావు. కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం సామాన్య ప్రజానికానికి ఉపయుక్తంగా ఉంటే వలస కార్మికుల అంశంలో మాత్రం శరాఘాతంగా పరిణమించింది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో జీవనోపాది కోల్పోయిన కూలీలు రాష్ట్రం కాని రాష్ట్రంలో పడరాని కఫ్టాలు పడుతున్నారని, వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

రైలు మార్గం ద్వారా వలస కూలీల తరలింపు.. రైళ్లకు పచ్చ జెండా ఊపిన కేంద్రం..
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎవరికి ఈ వ్యాధి ఏ మేరకు సోకిందో అంచనా వేయడం కష్టంగా మారింది. సాదారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత వలస కార్మికులను వారి వారి సొంత గ్రామాలకు పంపించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఐతే రోడ్డు మార్గం ద్వారా తరలిస్తే సురక్షితంగా ఉంటుందా.? లేక రైలు మార్గం ద్వారా తరలిస్తే సురక్షితంగా ఉంటుందా..? అనే అంశం పై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైలు మార్గం ఐతే ఎక్కువ ప్రయోజనాలతో పాటు త్వరిత గతిన వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు తరలించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నుండి ఝార్ఖండ్ బయలు దేరిన రైలు.. వలస కూలీల ప్రయాణం సురక్షితం..
ఇదే అంశం పట్ల లోతైన చర్చ జరిపిన ప్రభుత్వాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో గత నలభై రోజులుగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, వారి కుటుంబీకులను తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లి పోవచ్చని కేంద్ర హోంశాఖ అనుమతించింది. కేంద్ర హోం శాఖ అనుమతి మంజూరు చేసినప్పటికీ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన కార్మికులను ప్రత్యేక బస్సులలో కాకుండా రైళ్లలో తరలించేందుకు మాత్రమే అనుమతించాలని హోంశాఖకు విజ్ఞప్తి చేసుకున్నాయి. ఇందుకోసం రైళ్ల పునరుద్దరణకు కేంద్రం పచ్చా జెండా ఊపినట్టు తెలుస్తోంది.
40రోజులుగా స్తంభించిపోయిన రైళ్లు.. వలస కూలీల తరలింపుతో పట్టాలెక్కిన రైళ్లు..
దాదాపు నలభై రోజులుగా స్థంభించిపోయిన రైల్యే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరించేందకు మొగ్గు చూపుతోంది. అందులో బాగంగా హైదరాబాద్ లోని లింగంపల్లి నుండి ఝార్ఖండ్ రాష్టానికి ప్రత్యేక రైలును నడిపేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రకటించక ముందు నుంచే దేశంలో రైలు ప్రయాణాలు నిలిచిపోయాయి. గూడ్స్ రైళ్ళు తప్ప ప్రయాణికుల రైళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు టికెట్ల జారీకి సిద్ధమైన రైల్వేశాఖ, కేంద్ర హోంశాఖ హెచ్చరికలతో వెనక్కి తగ్గింది. అయితే తాజాగా దేశంలో రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రైల్వే శాఖ నిర్ధారిస్తోంది.

స్వస్థలాలకు చేరుకోనున్న కూలీలు.. రైలు మార్గమై సేఫ్ అంటున్న నిపుణులు..
అయితే వలస కార్మికులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి తమ రాష్ట్రాలకు చేరుకోవడం అంత శ్రేయస్కరం కాదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను పంపి తమ వారిని రప్పించుకోవడం అంత సులభం కాదని కూడా మరి కొన్ని రాష్ట్రాలు వాదించాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ రాష్ట్ర కార్మికులను ప్రత్యేక రైళ్లలో తరలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేంద్ర హోంశాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కోరిన విషయం తెలిసిందే. ఇదే విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దేశంలో ఇరుక్కు పోయిన వలస కార్మికులను రైలు మార్గం ద్వారానే పంపించేందుకు కేంద్రం సన్నాహాలు ముమ్మరం చేసింది.












Click it and Unblock the Notifications