ఐఐటీ ప్లేస్‌మెంట్స్: ఒక విద్యార్ధికి రూ. 91 లక్షల ప్యాకేజి
న్యూఢిల్లీ: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్ధులకు భార ప్యాకేజీలతో కూడిన ఉద్యోగావకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఏడాది జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒక విద్యార్ధికి ఏడాదికి రూ. 91 లక్షల ప్యాకేజీ అవకాశం వచ్చింది.
ఇప్పటికి దాదాపు 125 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయని ఐఐటీ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేతనాలు 20 శాతం అధికంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ప్యాకేజీ ఏడాదికి రూ. 91 లక్షలని వెల్లడించారు.

ఈ ఏడాది గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ ఐటీ సంస్ధలేగాగ ఈ కామర్స్ రంగానికి చెందిన అనేక కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ముందుకొచ్చాయని ప్లేస్‌మెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఛైర్మన్ ప్రొపెసర్ ఎస్‌కె బరారీ వెల్లడించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్ధులకు ఫైనల్ ప్లేస్‌మెంట్స్ డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications