Illegal affair: ఆంటీతో బీర్లు, బిర్యానీల పార్టీ, స్వామీ నదికిపోదామా, ఓకే, అంతే నదిలోనే కలిపేసింది !

చెన్నై/ క్రిష్ణగిరి: హ్యాపీగా స్వీట్ స్టాల్ లో హల్వా చేసుకుని అమ్ముకోవాల్సిన యువకుడు వేశ్యలతో పరిచయాలు పెంచుకుని వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. స్వీట్ స్టాల్ లో వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆ యువకుడు వేశ్య అయిన ఆంటీని పిలుచుకుని విహారయాత్రకు వెళ్లాడు. సరస్సు ఒడ్డున కుర్చుని ఆంటీతో బీర్లు తాగి బిర్యానీలు మెక్కిన యువకుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఇదే మంచి టైమ్ అని భావించిన ఆంటీ ఆ యువకుడు తాగుతున్న బీర్లలో మత్తు మందుకలిపి అతన్ని నిలువు దోపిడీ చేసి చివరికి అతన్ని చీర కొంగుతో ఉరి వేసి చంపేసి నదిలో కలిపేసింది.

 స్వీట్ స్టాల్ పళనిస్వామి

స్వీట్ స్టాల్ పళనిస్వామి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా (కర్ణాటక సరిహద్దు జిల్లా)లోని మనడిపట్టు గ్రామానికి చెందిన పళనిస్వామి (23) అనే యువకుడు కల్లకూరిచి జిల్లా కేంద్రం సమీపంలోని రోడ్డమంతూర్ ప్రాంతంలో స్వీట్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలం స్వీట్ స్టాల్ లో హ్యాపీగా హల్వా అమ్ముకున్న పళనిస్వామికి తరువాత స్వీట్ స్టాల్ కు వచ్చి వెలుతున్న కొందరు వేశ్యలతో పరిచయం పెరిగింది.

 రోజుకో వేశ్యతో ఎంజాయ్

రోజుకో వేశ్యతో ఎంజాయ్

పళనిస్వామి రోజుకో వేశ్యను మార్చిమార్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాగే ఓ వేశ్యతో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన పళనిస్వామి గత నెల 28వ తేదీన తియకతురువమ్ సమీపంలోని పృథ్వీమంగళం గ్రామం సమీపంలోని సరస్సులో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరస్సులో శవమై కనిపించిన యువకుడి పేరు పళనిస్వామి అని పోలీసులు గుర్తించారు.

 మనోడికి ఆంటీల పిచ్చి

మనోడికి ఆంటీల పిచ్చి

స్వీట్ స్టాల్ లో పని చేస్తున్న వ్యక్తులను పోలీసులు విచారణ చేశారు. పళనిస్వామికి అమ్మాయిలు ,ఆంటీల పిచ్చి ఉందని, అతను రోజు మార్చి రోజు కొత్తకొత్త అమ్మాయిలు (వేశ్యలు)తో ఎంజాయ్ చేస్తుంటాడని స్వీట్ స్టాల్ లో పని చేస్తున్న కొందరు పోలీసులకు చెప్పారు. హత్యకు గురైన పళనిస్వామి గోమతి (48) అనే ఆంటీతో ఎక్కువసార్లు ఎంజాయ్ చెయ్యడానికి బయటి ప్రాంతాలకు వెళ్లి వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మూడు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలించిన పోలీసులు గోమతిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

 ఆంటీతో బీర్లు తాగి, బిర్యానీలు తిని ఎంజాయ్

ఆంటీతో బీర్లు తాగి, బిర్యానీలు తిని ఎంజాయ్

హత్య జరిగిన రోజు మద్యాహ్నం పళనిస్వామి ఆంటీ గోమతితో కలిసి బయటకు వెళ్లాడు. మార్గం మద్యలో ఓ హోటల్ లో బిర్యానీలు తీసుకున్నారు. మద్యం షాపులో బీర్లు తీసుకున్న పళనిస్వామి ఆంటీతో కలిసి తియకతురువమ్ సమీపంలోని పృథ్వీమంగళం గ్రామం సమీపంలోని సరస్సు ఒడ్డుకు చేరుకున్నారు. ఆరోజు రాత్రి ఆంటీ గోమతితో కలిసి బీర్లు తాగిన పళనిస్వామి ఆమెతో ఎంజాయ్ చేశాడు.

 బీర్లు బిరియానీల్లో మత్తుమందు

బీర్లు బిరియానీల్లో మత్తుమందు

బీర్లు తాగి తనతో ఎంజాయ్ చేస్తున్న పళనిస్వామిని చంపేయాలని తాను డిసైడ్ అయ్యాయని గోమతి పోలీసులకు చెప్పింది. తనతో పాటు వచ్చిన మగాళ్లతో తాను బీర్లు తాగుతానని, కానీ వాళ్లు తాగే బీర్లు, బిర్యానీల్లో మత్తుమందు కలిపి వారు మత్తులోకి జారుకున్న తరువాత వారి దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు లూటీ చేస్తానని ఆంటీ గోమతి పోలీసుల విచారణలో ఆంగీకరించింది.

 పక్కాస్కెచ్ తో చంపేసింది

పక్కాస్కెచ్ తో చంపేసింది

బీర్లు, బిర్యానీల్లో మత్తు మందుకలిపి పళనిస్వామికి ఇచ్చినా అతను మత్తులోకి జారుకోలేదని, తన చీర కొంగుతో అతని గొంతు నులిమి హత్య చేశారని గోమతి చెప్పిందని పోలీసులు అన్నారు. పళనిస్వామిని శవాన్ని సరస్సులో విసిరేసే ముందు అతని జోబులో ఉన్న రూ. 3,500 డబ్బు, అతని విలువైన మొబైల్ లాక్కొని తాను పారిపోయానని గోమతి విచారణలో అంగీకరించిందని పోలీసులు అన్నారు.. గోమతి ఇంకా ఎంతమందిని ఇలా హత్య చేసింది ? అనే విషయం ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+