Illegal affair: భర్తను చంపేసి ప్రియుడితో ఎస్కేప్, పబ్లిక్ గా ?, గ్రహాలు అనుకూలించక ఏడాదికి !

న్యూఢిల్లీ/ఫరీదాబాద్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్న సమయంలోనే చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. భర్తతో గొడవ పడుతున్న సమయంలోనే అతని భార్య ప్రియుడిని సెట్ చేసుకుంది. ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు మాత్రం పస్తులు పెట్టింది. ప్రియుడి మోజులో పడి భర్తను పూర్తిగా నిర్లక్షం చేసింది. కొంతకాలం తరువాత ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్త హత్యకు స్కెచ్ వేసింది. అనుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను చంపేసి శవం మాయం చేసింది. సొంతఊరుకు వెళ్లిన తన భర్త మాయం అయ్యాడని అతని భార్య పోలీసు కేసు పెట్టింది. భర్త కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టిన అతని భార్య ఆమె ప్రియుడితో కలిసి మాయం అయ్యింది. భర్త శవం చిక్కినా కిలాడీ లేడీ మాత్రం పోలీసలకు చిక్కలేదు. భర్త హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడీ, ఆమె ప్రియుడు సంవత్సరం తరువాత పోలీసులకు చిక్కిపోవడంతో హాట్ టాపిక్ అయ్యింది.

 భర్తతో హ్యాపీలైఫ్ గడిపిన భార్య

భర్తతో హ్యాపీలైఫ్ గడిపిన భార్య

దేశ రాజధాని న్యూఢిల్లీలోని భజన్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద్ కుమార్ అలియాస్ అరవింద్ (27) అనే యువకుడు నివాసం ఉండేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు రేఖా రాయ్ (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అరవింద్ కుమార్ కు చెప్పారు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న అరవింద్ కుమార్, రేఖా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

 చిన్నగా ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

చిన్నగా ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

అరవింద్ కుమార్, రేఖా రాయ్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్న సమయంలోనే ఇంట్లో చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. భర్త అరవింద్ కుమార్ తో గొడవ పడుతున్న సమయంలోనే అతని భార్య రేఖా రాయ్ కి షోకిన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం రేఖా రాయ్, షోకిన్ స్నేహితులుగానే ఉన్నారు. రానురాను రేఖా రాయ్ ఒక్క అడుగు ముందుకు వేసి షోకిన్ ను ప్రియుడిగా సెట్ చేసుకుంది.

 ప్రియుడికి పులిహోరా..... భర్తకు పస్తులు పెట్టిన భార్య

ప్రియుడికి పులిహోరా..... భర్తకు పస్తులు పెట్టిన భార్య

అక్రమ సంబంధం పెట్టుకున్న రేఖా రాయ్, షోకిన్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. భర్త అరవింద్ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత రేఖా రాయ్ ఆమె ప్రియుడు షోకిన్ తో కలిసి సినిమాలు, షికార్లు తిరుగి ఎంజాయ్ చేసింది. ప్రియుడు షోకిన్ తో బయట ఎంజాయ్ చేస్తున్న రేఖా రాయ్ ఇంట్లో ఆమె భర్త అరవింద్ కుమార్ కు మాత్రం పస్తులు పెట్టింది.

 ప్రియుడి మోజులో పడి భర్తను నిర్లక్షం చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను నిర్లక్షం చేసిన భార్య

ప్రియుడు షోకిన్ తో కలిసి రేఖా రాయ్ ఎంజాయ్ చేస్తోందని ఆమె భర్త అరవింద్ కుమార్ కు తెలిసిపోయింది. భార్య రేఖాను పట్టుకుని బెండ్ తీసిన అరవింద్ కుమార్ పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడు షోకిన్ మోజులో పడిన రేఖా రాయ్ ఆమె భర్త అరవింద్ కుమార్ ను పూర్తిగా నిర్లక్షం చేసిం

 భర్తను చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

భర్తను చంపేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

కొంతకాలం తరువాత ప్రియుడు షోకిన్ మోజులో పడిన రేఖా రాయ్ ఆమె భర్త అరవింద్ కుమార్ హత్యకు స్కెచ్ వేసింది. అనుకున్న ప్రకారం 2021 అక్టోబర్ 16వ తేదీన ప్రియుడు షోకిన్ తో కలిసి భర్త అరవింద్ కుమార్ ను చంపేసి అతని శవం మాయం చేసింది. బీహార్ లోని సొంతఊరుకు వెళ్లిన తన భర్త అరవింద్ కుమార్ కనపడటం లేదని రేఖా రాయ్ అతని భార్య పోలీసు కేసు పెట్టింది.

 ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

తన భర్త అరవింద్ కుమార్ కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టిన అతని భార్య రేఖా రాయ్ ఆమె ప్రియుడి షోకిన్ తో కలిసి మాయం అయ్యింది. హర్యానాలోని ఫరీదాబాద్ లోని ఈస్టర్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో అరవింద్ కుమార్ శవం చిక్కింది. ఫరిదాబాద్ పోలీసులు న్యూఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త శవం చిక్కినా అతని భార్య, కిలాడీ లేడీ రేఖా రాయ్ మాత్రం పోలీసులకు చిక్కలేదు.

 ఏడాది తరువాత భార్య, ప్రియుడు అరెస్టు

ఏడాది తరువాత భార్య, ప్రియుడు అరెస్టు

ఫరీదాబాద్ సమీపంలో ప్రియుడు షోకిన్ తో కలిసి రేఖా రాయ్ కాపురం పెట్టి అతనితో ఎంజాయ్ చేస్తోంది. భర్త అరవింద్ కుమార్ హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడీ రేఖా రాయ్, ఆమె ప్రియుడు షోకిన్ సంవత్సరం తరువాత ఫరీదాబాద్ పోలీసులకు చిక్కిపోవడంతో హాట్ టాపిక్ అయ్యింది. తన భర్త అరవింద్ కుమార్ ను తన ప్రియుడు షోకిన్ తో కలిసి హత్య చేశానని రేఖా రాయ్ అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు. సంవత్సరం తరువాత హత్య కేసులో హంతకులను అరెస్టు చేసిన పోలీసులకు రూ. 50, 000 రివార్డును పై అధికారులు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+