Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

లక్నో/చెన్నై: భర్తతో హ్యాపీగా కాపురం చేస్తున్న భార్య ఓ బిడ్డకు తల్లి అయ్యింది. భర్త సిటీలో పని చేస్తుండటంతో భార్య సొంత ఊర్లో ఉంటోంది. తన తమ్ముడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో భర్త సొంత ఊరికి చేరుకున్నాడు. తన తమ్ముడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేస్తూ తన పరువు తీస్తోందని భర్త రగిలిపోయాడు. కత్తితో భార్య గొంతు కోసి అదే కత్తితో తమ్ముడిని నరికేశాడు. భర్త దెబ్బతో భార్య ప్రాణాలు పోవడంతో తమ్ముడికి తీవ్రగాయాలై తప్పించుకున్నాడు.

భర్తతో హ్యాపీలైఫ్

భర్తతో హ్యాపీలైఫ్


ఉత్తరప్రదేశ్ లోని బరాచ్ జిల్లాలోని కొట్వాలి నన్సారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా గ్రామంలో రాజేష్ సింగ్, రీటా (32) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రాజేష్ సింగ్ తో చక్కగా కాపురం చేసిన రీటా ఓ బిడ్డకు తల్లి అయ్యింది. భార్య రీటాతో సంతోషంగా ఉంటున్న రాజేష్ సింగ్ డబ్బు సంపాధించడానికి సిటీకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.

 ఢిల్లీలో భర్త..... ఇంట్లో మరిదితో ?

ఢిల్లీలో భర్త..... ఇంట్లో మరిదితో ?

డబ్బు సంపాధించడానికి ఢిల్లీ వెళ్లిన రాజేష్ సింగ్ అక్కడే మేస్త్రీగా పని చేస్తూ నెలకు ఒకసారి సొంత గ్రామానికి వెళ్లి భార్య రీటాతో కలిసి రెండు మూడు రోజులు ఉంటున్నాడు. భర్త రాజేష్ సింగ్ ఢిల్లీ వెళ్లిన సమయంలో భర్త రాజేష్ సింగ్ తమ్ముడు బ్రిజ్ రాజ్ తో రీటా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టిందని సమాచారం.

కరోనా దెబ్బతో ఇంటికి వచ్చిన భర్త

కరోనా దెబ్బతో ఇంటికి వచ్చిన భర్త

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో ఢిల్లీలో విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో చెయ్యడానికి పనిలేక రాజేష్ సింగ్ సొంత ఊరికి వెళ్లిపోయాడు. భర్త రాజేష్ సింగ్ ఇంటికి రావడంతో అతని భార్య రీటాకు ఆమె మరిదిని కలుసుకుని ఎంజాయ్ చెయ్యడానికి ఇబ్బంది ఎదురైయ్యిందని సమాచారం.

భర్త లేని టైమ్ లో మరిదితో మసాజ్ ?

భర్త లేని టైమ్ లో మరిదితో మసాజ్ ?

భర్త బయటకు వెళ్లిన సమయంలో, పొలం దగ్గర ఉన్న సమయంలో రీటా ఆమె మరిది బ్రిజ్ రాజ్ తో ఎంజాయ్ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. నేను ఎప్పుడెప్పుడు బయటకు పోతానా అంటూ ఎదరు చూస్తున్న తన భార్య రీటా తన తమ్ముడు బ్రిజ్ రాజ్ తో కులుకుతోందని ఇంకా అనుమానం పెంచుకున్న భర్త రాజేష్ భార్యను పట్టుకుని చితకబాదేశాడు.

 భార్య హత్య....తమ్ముడు జస్ట్ మిస్

భార్య హత్య....తమ్ముడు జస్ట్ మిస్

రీటా అక్రమ సంబంధం విషయంలో ఆమె భర్త రాజేష్ సింగ్ రోజూ గొడవపడటం మొదలుపెట్టాడు. రాత్రి సహనం కోల్పోయిన భర్త రాజేష్ సింగ్ అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. ఆ సమయంలో తమ్ముడు బ్రిజ్ రాజ్ అడ్డురావడంతో రాజేష్ సింగ్ ఇంకా రగిలిపోయాడు. వెంటనే పదునైన కత్తి తీసుకుని భార్య రీటా గొంతు కోసే చంపేశాడు. అడ్డుపడిన తమ్ముడు బ్రిజ్ రాజ్ మీద రాజేష్ సింగ్ దాడి చేశాడు.

స్టోరీ మొత్తం చెప్పిన భర్త

స్టోరీ మొత్తం చెప్పిన భర్త

రీటా హత్య జరిగిన విషయం తెలుసుకున్న నాన్పారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్త రాజేష్ సింగ్ ను అరెస్టు చేశారు. తీవ్రగాయాలైన బ్రిజ్ రాజ్ ను ఆసుపత్రికి తరలించారు. భర్త చేతిలో హత్యకు గురైన రీటా మృతదేహాన్ని పోస్టుమార్టుంకు పంపించామని బరాచ్ జిల్లా అడిషినల్ ఎస్పీ అశోక్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న రీటా హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+