Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: మిలటరి మొగుడు, డ్రైవర్ ప్రియుడు, బెడ్ రూమ్ లోకి బిడ్డ వచ్చాడని !

చెన్నై/ తిరుపతి: మిలటరిలో ఉద్యోగం చేస్తున్న మొగుడితో కాపురం చేసిన భార్య ఓ బిడ్డకు జన్మనిశ్చింది. ప్రియుడి వ్యామోహంతో అతనితో జెండా ఎత్తేసిన భార్య పిచ్చపాటిగా తిరుగుతూ జల్సా చేసింది. బెడ్ రూమ్ లో పదేపదే రాసలీలలకు కన్న కొడుకు అడ్డం వస్తున్నాడని కన్న తల్లితో పాటు ఆమె ప్రియుడు సహించలేకపోయారు. కన్నబిడ్డ అని కనికరం లేకుండా తల్లి బిడ్డను చితకబాదుతూ వచ్చింది. ఎవడికో పుట్టిన బిడ్డ మనకు ఎందుకు అంటూ ప్రియుడు రెచ్చగొట్టడంతో కన్న కొడుకును తల్లి ప్రియుడితో కలిసి చంపేసింది. బిడ్డను చంపిన పాపం ఊరికేపోలేదు. నీలాంటి తల్లి బయట ప్రపంచంలో ఉంటే సమాజానికి చేటు దాపురిస్తుందని కిరాతకురాలి యవ్వనం కరిగిపోయే వరకు ఆ మహాతల్లికి కోర్టు 17 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

మిలటరిలో మొగుడు

మిలటరిలో మొగుడు

తమిళనాడులోని శివగంగై జిల్లా ఇలయంగుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న శివానందమ్ మిలటరిలో సైనికుడిగా ఉద్యోగం చేసేవాడు. శివానందమ్ టైమ్ బాగాలేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు 2010లో వనిత (29) అనే కిలాడిని ఇచ్చి వివాహం జరిపించారు. సైనికుడిగా పని చేస్తున్న శివానందమ్ సెలవుల్లో వచ్చి భార్య వనితతో కాపురం చెయ్యడంతో నందీష్ కుమార్ (4) అనే కుమారుడు పుట్టాడు.

మేడమ్ కు పక్కలో ప్రియుడు

మేడమ్ కు పక్కలో ప్రియుడు

వనిత సొంతఊర్లో నివాసం ఉంటున్న శివకార్తిక్ అలియాస్ కార్తిక్ రాజా (28) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వనితకు శివకార్తిక్ కు ముందు నుంచి పరిచయం ఉండటంతో వారి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. మొగుడు మిలటరిలో ఉండటంతో అడిగే దిక్కులేక వనిత ప్రియుడు శివకార్తిక్ తో విచ్చలవిడిగా తిరిగేసింది.

ప్రియుడితో తిరుపతిలో కాపురం

ప్రియుడితో తిరుపతిలో కాపురం


2015లో భార్య శివానందమ్ కు నామం పెట్టిన వనిత బిడ్డ నందీష్ కుమార్ ను పిలుచుకుని ప్రియుడు శివకార్తిక్ తో కాలిసి పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నగరంలో ఓ అద్దె ఇంటిని తీసుకున్న వనిత, శివకార్తిక్ తాము భార్య భర్తలు అని చుట్టుపక్కల వాళ్లను నమ్మించి కాపురం పెట్టారు. తిరుపతిలోనే శివకార్తిక్ కారు డ్రైవర్ గా పనిచెయ్యడం మొదలుపెట్టాడు.

కొడుకు రాసలీలకు అడ్డు వస్తున్నాడని ?

కొడుకు రాసలీలకు అడ్డు వస్తున్నాడని ?

వనిత ఆమె ప్రియుడు శివకార్తిక్ తో పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇంట్లో రాసలీలు సాగించడం మొదలుపెట్టింది. కామం తీర్చుకుంటున్న తల్లి వనిత పదేపదే ఆమె కొడుకు నందీష్ కుమార్ బెడ్ రూమ్ లోకి రావడం సహించలేకపోయింది. అప్పటి నుంచి కొడుకు నందీష్ కుమార్ ను ఆమె తల్లి వనిత, ప్రియుడు శివకార్తిక్ చితకబాదడం మొదలుపెట్టారు.

బిడ్డను చంపేసి పూడ్చేసింది

బిడ్డను చంపేసి పూడ్చేసింది

2015 ఆగస్టు 18వ తేదీన కొడుకు నందీష్ కుమార్ ను పిలుచుని వనిత, ఆమె ప్రియుడు శివకార్తిక్ తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లారు. ఆ సమయంలో నందీష్ కుమార్ మీద వనిత, ఆమె ప్రియుడు శివకార్తిక్ దాడి చెయ్యడంతో దెబ్బలు తట్టుకోలేక నందీష్ కుమార్ ప్రాణాలు వదిలేశాడు. క్రిష్ణగిరిలోనే కొడుకు నందీష్ కుమార్ ను పూడ్చిపెట్టిన వనిత ప్రియుడు శివకార్తిక్ తో కలిసి మళ్లీ తిరుపతిలోని ఇంటికి వెళ్లిపోయింది.

తమిళ సినిమా స్టోరీ చెప్పింది

తమిళ సినిమా స్టోరీ చెప్పింది

బిడ్డలేకుండా వనిత, శివకార్తిక్ మాత్రమే తిరుపతిలోని ఇంటికి రావడంతో ఆ ఇంటి యజమాని మీ బిడ్డ ఎక్కడ అని ప్రశ్నించాడు. అనారోగ్యంగా ఉండటంతో మా ఊర్లో వదిలిపెట్టి వచ్చామని కొన్ని రోజులు వనిత ఇంటి యజమానిని నమ్మించింది. రానురాను వనిత తీరుపై అనుమానం రావడంతో ఇంటి యజమాని తిరుపతి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వనితను, శివకార్తిక్ ను ప్రశ్నించగా నందీష్ కుమార్ ను హత్య చేశామని అంగీకరించారు.

తల్లికి సరైన జైలు శిక్ష.... ప్రియుడు మాయం

తల్లికి సరైన జైలు శిక్ష.... ప్రియుడు మాయం


ప్రియుడి వ్యామోహంలో సొంత కొడుకు నందీష్ కుమార్ ను దారుణంగా హత్య చేసిన వనిత, ఆమె ప్రియుడు శివకార్తిక్ ను పోలీసులు జైలుకు పంపించారు. కేసు క్రిష్ణగిరికి బదిలి అయ్యింది. బెయిల్ మీద ఇద్దరూ బయటకు వచ్చారు. వనిత క్రిష్ణగిరి కోర్టుకు హాజరు అవుతున్నా శివకార్తిక్ మాత్రం మాయం అయిపోయాడు. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. వనిత సొంత కొడుకును హత్య చేసిందని రుజుకు కావడంతో ఆమెకు 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ క్రిష్ణగిరి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలతో వనితను సెంట్రల్ జైలుకు పంపించారు. మాయం అయిన వనిత ప్రియుడు శివకార్తిక్ కోసం తమిళనాడు, తిరుపతి పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+