Illegal affair: ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య, ఎస్ఐ ఆడియో లీక్, వైరల్ !
చెన్నై/మదురై: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క అడుగు ముందుకు వేసిన భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త మీద కేసు పెట్టింది. భర్తను పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు అతన్ని చితకబాదేశారు. తరువాత పదేపదే భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐతో టచ్ లో ఉంది. భార్య అసలు మ్యాటర్ తెలుసుకున్న భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కోడలు ఎస్ఐతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, ఆ విషయం తెలుసుకున్న తన కొడుకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి కేసు పెట్టింది. ఇదే సమయంలో భర్త, ఎస్ఐ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ గురించి చర్చించిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని మదురై నగరంలో సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం సెల్వరాజ్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. సెల్వరాజ్, రజని దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు.

భర్త మీద కేసు పెట్టిన భార్య
కొన్ని సంవత్సరాల తరువాత సెల్వరాజ్, రజని దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా రజని మాత్రం ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఒక్క అడుగు ముందుకు వేసిన రజని మదురైలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె భర్త సెల్వరాజ్ మీద కేసు పెట్టింది.

ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం
సెల్వరాజ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు అతన్ని చితకబాదేశారు. తరువాత పదేపదే రజని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ స్టేషన్ ఎస్ఐతో టచ్ లో ఉంది. భర్త సెల్వరాజ్ మీద కేసు పెట్టి అతన్ని కొట్టించిన రజని అంతటితో వదిలిపెట్టలేదు. ఎస్ఐను తన అందచందాలతో లొంగదీసుకున్న రజని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

భార్య అక్రమ సంబంధం దెబ్బతో భర్త ఆత్మహత్య
భార్య రజని, ఎస్ఐ అక్రమ సంబంధం మ్యాటర్ తెలుసుకున్న సెల్వరాజ్ ఏమీ చెయ్యలేక, ఎస్ఐని ఎదిరించి పోరాడలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కోడలు రజని ఎస్ఐతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, ఆ విషయం తెలుసుకున్న తన కొడుకు సెల్వరాజ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది.

ఆడియో లీక్..... వైరల్
సెల్వరాజ్ ఆత్మహత్య చేసుకున్న తరువాత అంతకు ముందు అతను ఎస్ఐతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. నా భార్యను వదిలేయాలని, మేము ఎక్కడికైనా వెళ్లి సుఖంగా ఉంటామని సెల్వరాజ్ ఎస్ఐని వేడుకుంటున్న సమయంలో ఆడియో రికార్డు కావడం, సెల్వరాజ్ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆ ఆడియో లీక్ అయ్యింది.

కిలాడీ ఎస్ఐ ఏం చెప్పాడంటే ?
నేను నీ భార్యతో ఇంతకాలం ఎంజాయ్ చేసి తప్పు చేశానని, ఇక ముందు నేను నీ భార్య జోలికి రాను, నన్ను క్షమించు అని ఎస్ఐ చెప్పిన మాటలను సెల్వరాజ్ రికార్డు చెయ్యడంతో ఆ ఆడియో లీక్ అయ్యింది. ఎస్ఐ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారులు సెల్వరాజ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. సెల్వరాజ్ భార్య రజనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications