too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?
నోయిడా/లక్నో: భర్త ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటున్నది. భర్త అతని భార్యకు మంచి స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. భర్త బయటకు వెళ్లిన వెంటనే భార్య మొబైల్ ఫోన్ కు అంకితం అయిపోతున్నదని తెలిసింది. భర్త ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య మొబైల్ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ అని రావడంతో భర్త రగిలిపోయాడు. రాత్రి భర్త ఇంటికి వచ్చిన విషయం కూడా గుర్తించకుండా భార్య ఫోన్ లో ఓ వ్యక్తితో నాటీగా మాట్లాడుతోంది. భర్త అతని భార్య మొబైల్ ఫోన్ లాక్కొని ఫోన్ నెంబర్ చూసి సహనం కోల్పోయాడు. అంతే కథ క్లోజ్ అయ్యింది.

నాలుగేళ్ల క్రితం పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ కు చెందిన సూరజ్ కుమార్ అలియాస్ సూరజ్ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం అంజలి (23) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సూరజ్, అంజలి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. రెండు సంవత్సరాల పాటు సూరజ్, అంజలి దంపతులు ఆజంగడ్ ప్రాంతంలోనే నివాసం ఉన్నారు. అంజలి, సూరజ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది.

నోయిడాకు ఫ్యామిలీ షిఫ్ట్
నోయిడాలోని ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్ లో సూరజ్ కు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చెయ్యడానికి నోయిడాకు బయలుదేరిన సూరజ్, అంజలి దంపతులు వారి కుమార్తెను అమ్మమ్మ (అంజలి పుట్టింటిలో) ఇంటిలో వదిలిపెట్టారు. అంజలి, సూరజ్ దంపతులు నోయిడా చేరుకుని సెక్టార్ 58 లో అద్దె ఇళ్లు తీసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు.

భార్యకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన భర్త
సూరజ్ ప్రతిరోజు ఫర్నీచర్ షోరూమ్ లో ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. అంజలి ఇంట్లోనే ఉంటున్నది. సూరజ్ కుమార్ అతని భార్య అంజలికి మంచి స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. సూరజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే అతని భార్య అంజలి మొబైల్ ఫోన్ కు అంకితం అయిపోతున్నదని తెలిసింది. సూరజ్ ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య అంజలి మొబైల్ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ అని రావడంతో భర్త రగిలిపోయాడు.

భార్యకు అక్రమ సంబంధం ?
ఇంటికి వెళ్లిన సూరజ్ ఎందుకు నీ ఫోన్ పదేపదే ఎంగేజ్ వస్తోందని ప్రశ్నించాడు. మా అమ్మతో మాట్లాడుతున్నానని, మా అక్కతో మాట్లాడుతున్నానని అంజలి ఏదోఒక సినిమా స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. తరువాత సూరజ్ కు అసలు విషయం తెలిసింది. పుట్టింటి దగ్గర తన భార్య అంజలికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని నిత్యం అతనితో మాట్లాడుతోందని సూరజ్ రగిలిపోయాడు.

భార్య గొంతు చీల్చి చంపేసి ఏం చేశాడంటే ?
రాత్రి సూరజ్ ఇంటికి వెళ్లాడు. భర్త ఇంటికి వచ్చిన విషయం కూడా గుర్తించకుండా అంజలి వేరే యువకుడితో ఫోన్ లో నాటీగా మాట్లాడుతోంది. సూరజ్ అతని భార్య అంజలి మొబైల్ ఫోన్ లాక్కొని పరిశీలించాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని భార్య అంజలని ప్రశ్నించాడు. భార్య అంజలి ఇచ్చిన సమాధానంతో రగిలిపోయిన సూరజ్ వంటగదిలోని కత్తి తీసుకుని అతని భార్య అంజలి గొంతు చీల్చి ఎక్కడంటే అక్కడ పొడిచి ఆమెను చంపేశాడు.

ఇంటికి తాళం వేసి ఎస్కేప్
భార్య అంజలిని హత్య చేసిన సూరజ్ ఇంటి బయట తాళం వేసుకుని పరారైనాడు. మూడు రోజులు అయినా దంపతులు కనపడకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు, ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పలగొట్టి చూడా అంజలి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అంజలి శవం కుళ్లిపోవడంతో దుర్వాసన వచ్చిందని. భార్యను హత్య చేసి పరారైన సూరజ్ కోసం గాలిస్తున్నామని డీసీపీ అశుతోష్ ద్వివేది మీడియాకు చెప్పారు.

రాత్రి గొడవ జరిగింది
ఆరోజు రాత్రి సూరజ్, అంజలి పెద్దగా గొడవపడిన విషయం చుట్టుపక్కల వారికి వినిపించిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని డీసీపీ అశుతోష్ ద్వివేది అన్నారు. భార్య అంజలికి అక్రమ సంబందం ఉందని ఆమెను సూరజ్ దారుణంగా హత్య చెయ్యడం నోయిడా సెక్టార్ 58లో కలకలకం రేపింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications