Illegal affair: ముగ్గురితో అక్రమ సంబంధం, డైలీ సెకండ్ షో సినిమా, భర్తను చంపేసిన భార్య !

చెన్నై/ దిండుగల్: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడు 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. సొంతపొలంలో వ్యవసాయం చేయిస్తూ డబ్బులు సంపాధిస్తున్న భర్త 15 సంవత్సరాల క్రితం వరకు అతని భార్యతో సంతోషంగానే జీవించాడు. కొన్ని సంవత్సరాల నుంచి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్తతో గొడవపడిన ప్రతిసారి అతని భార్య అదే ఊరిలో ఉంటున్న పుట్టింటికి వెళ్లిపోతున్నది. భర్త సైడ్ బంధువులు, భార్య సైడ్ బంధువులు ప్రతిసారి దంపతులను రాజీ చేస్తున్నారు. ఇదే సమయంలో డబ్బులు బాగా సంపాధిస్తున్న భర్త ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. బయట పరాయి మహిళలతో జల్సా చేస్తున్న భర్త రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యను పట్టుకుని చితకబాది ఆమెకు సెకండ్ షో సినిమా చూపిస్తున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి ఇంటి ముందు భర్త శవమై కనిపించాడు. భర్త శరీరం మీద అనేక గాయాలు ఉండటం, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో భార్య ఆమె భర్తను చంపేసిందని వెలుగు చూడటంతో కథ రసవత్తరంగా మారింది.

రైతు హ్యాపీలైఫ్

రైతు హ్యాపీలైఫ్

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళనియార్ సమీపంలోని పెరుమాళ్ పుత్తూరులో కరుప్పుస్వామి (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెరుమాళ్ పుత్తూరులోనే నివాసం ఉంటున్న మీనాక్షి అనే మహిళను 20 సంవత్సరాల క్రితం కరుప్పస్వామి వివాహం చేసుకున్నాడు. సొంతపొలంలో వ్యవసాయం చేయిస్తూ డబ్బులు సంపాధిస్తున్న కరుప్పస్వామి 15 సంవత్సరాల క్రితం వరకు అతని భార్య మీనాక్షితో చాలా సంతోషంగా జీవించాడు.

గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య

గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య

కొన్ని సంవత్సరాల నుంచి కరుప్పస్వామి, మీనాక్షి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త కరుప్పస్వామితో గొడవపడిన ప్రతిసారి అతని భార్య మీనాక్షి పెరుమాళ్ పుత్తూరులోని పుట్టింటికి వెళ్లిపోతున్నది. భర్త కరుప్పస్వామి సైడ్ బంధువులు, అతని భార్య మీనాక్షి సైడ్ బంధువులు ప్రతిసారి దంపతులను రాజీ చేస్తున్నారు.

ముగ్గురితో అక్రమ సంబంధం

ముగ్గురితో అక్రమ సంబంధం


డబ్బులు బాగా సంపాధిస్తున్న కరుప్పస్వామి అతని నివాసం ఉంటున్న ఊరిలో ఒకరితో, పక్కఊర్లలో నివాసం ఉంటున్న మరో ఇద్దరితో మొత్తం ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఎంజాయ్ చేస్తున్నాడు. కరుప్పస్వామి అక్రమ సంబంధాల విషయం గత ఏడాది అతని భార్య మీనాక్షి తెలిసిపోయింది.

భార్యకు సెకండ్ షో సినిమా చూపిస్తున్న భర్త

భార్యకు సెకండ్ షో సినిమా చూపిస్తున్న భర్త

బయట పరాయి మహిళలతో జల్సా చేస్తున్న కరుప్పస్వామి ప్రతిరోజూ రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య మీనాక్షిని పట్టుకుని చితకబాది ఆమెకు సెకండ్ షో సినిమా చూపిస్తున్నాడు. రానురాను కురుప్పస్వామి టార్చర్ ఎక్కువ కావడంతో అతని భార్య మీనాక్షి విసిగిపోయిందని సమాచారం. 10 రోజుల క్రితం భర్త కరుప్పస్వామితో గొడవ పడిన అతని భార్య మీనాక్షి అదే ఊరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్త ఇంటికి పంచాయితీకి వెళ్లిన భార్య

భర్త ఇంటికి పంచాయితీకి వెళ్లిన భార్య

రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన కరుప్పస్వామి ఇంట్లో టీవీ చూస్తున్నాడు. కొంత సేపటి తరువాత అతని భార్య మీనాక్షి, ఆమె సోదరుడు రాజేంద్రన్, అతని కజిన్ శక్తిశివం కరుప్పస్వామి ఇంటి దగ్గరకు వెళ్లారు. ఎందుకు ప్రతిసారి మా సోదరి మీనాక్షితో గొడవపడి ఆమెను కొడుతున్నావని రాజేంద్రన్, శక్తిశివం కరుప్పస్వామితో గొడవపెట్టుకున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాల మద్య మాటామాటా పెరిగిపోయింది.

భర్తను కొట్టి చంపేసిన భార్య, హెల్ప్ చేసిన బావమరుదులు

భర్తను కొట్టి చంపేసిన భార్య, హెల్ప్ చేసిన బావమరుదులు


కరుప్పస్వామి, మీనాక్షి దంపతుల మద్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న భర్త కరుప్పస్వామి మీద ఇనుపరాడ్ తీసుకుని దాడి చేసింది. అదే సమయంలో బావమరుడులు రాజేంద్రన్, శక్తిశివం కూడా కరుప్పస్వామి మీద దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్త కరుప్పస్వామి శవాన్ని అతని ఇంటి ముందే వదిలేసిన అతని భార్య మీనాక్షి, అమె సోదరుడు రాజేంద్రన్, కజిన్ శక్తిశివం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
    భర్తను చంపిన భార్య అరెస్టు

    భర్తను చంపిన భార్య అరెస్టు

    మరుసటి రోజు ఉదయం కరుప్పస్వామి శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కరుప్పస్వామి శరీరం మీద అనేక గాయాలు ఉండటం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కరుప్పస్వామిని అతని భార్య మీనాక్షి, ఆమె సోదరుడు రాజేంద్రన్, వారి బందువు శక్తిశివం హత్య చేశారని వెలుగు చూడటంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+