Wife: ప్రియుడికి స్వర్గం చూపించింది, భర్తను పిలిపించి అదే ప్రియుడిని ఏం చేసిందంటే ?, మిడ్ నైట్ లో !
బెంగళూరు: ఐటీ హబ్ చేరుకున్న దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భార్య ఉద్యోగం చేస్తోంది. భర్త కూడా ఏదో ఒకపని చెయ్యాలని చేస్తున్నాడు. ఇదే సమయంలో స్నేహితురాలి కారణంగా భార్యకు కోరియర్ బాయ్ పరిచయం అయ్యాడు. కోరియర్ భాయ్ తో వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త కోపంతో ఊరికి వెళ్లిపోయాడు. ప్రియుడి ఇంటికే వెళ్లిన మహిళ అతనితో కాపురం పెట్టింది. కొన్ని నెలల తరువాత వేరే రాష్ట్రంలో ఉన్న భర్తకు ఫోన్ చేసి పిలిపించిన భార్య ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసింది.

బెంగళూరులో దంపతులు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గంగేష్, రీనా దంపతులు ఉపాధి వెతుక్కుంటూ కొన్నేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని దొడ్డబేగూర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రీనా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తోంది. రీనా భర్త గంగేష్ పెయింటింగ్ పనిచేసేవాడు. రీనా, ంగేష్ దంపతులకు నలుగురు పిల్లలు.

మొగుడు తాగుబోతు... కోరియర్ బాయ్ ఎంట్రీ
నిబాషిస్ పాల్ అనే యువకుడికి వివాహం కాలేదు. పాల్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గంగేష్ ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. భర్త గంగేస్ తీరుతో అతని భార్య రీనా విసిగిపోయింది. ఇదే సమయంలో స్నేహితురాలి కారణంగా రీనాకు కొరియర్ బాయ్ పాల్‌తో పరిచయం అయ్యాడు. రానురాను కొరియర్ బాయ్ పాల్, రీనా ఫోన్ నెంబర్లు మార్చుకుని గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ప్రియుడికి స్వర్గం చూపించింది
భర్త గంగేష్ తాగుబోతు కావడంతో రీనా కొరియర్ బాయ్ పాల్ ను వలలో వేసుకుని అతనితో అక్రమ సంబందం పెట్టుకుని అతనికి స్వర్గం చూపించింది. గంగేష్ తాగుబోతు కావడంతో పాల్ అతని ప్రియురాలు రీనా ఇంటికి వస్తూ పోతూ ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. భార్య రీనా అక్రమ సంబంధం గురించి ఆమె గంగేష్‌కి తెలిసిపోయింది. గంగేష్ భార్య మీద కోపంతో పిల్లలను పిలుచుకుని ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయాడు.

ప్రియుడి ఇంటికి జంప్ జిలాని
భర్త గంగేష్ ఊరికి వెళ్లిపోవడంతో అతని భార్య రీనా కుడ్లు సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న ప్రియుడు పాల్ ఇంటికి వెళ్లి అక్కడ మకాం వేసింది. ఇరుగుపొరుగు వారు ఎవరు ఆమె అని అడిగితే రీనా నా భార్య అని, ఇద్దరూ దంపతులు అని పాల్ చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు ప్రియురాలు రీనాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన పాల్ తరువాత ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ప్రియురాలు రీనాను వేధించడం ప్రారంభించాడు.

నువ్వు సెకండ్ హ్యాండ్ కదా... ఇలా చేస్తే తప్పులేదులే.... ఓకే చెప్పు
నా ఫ్రెండ్స్ తో శారీరక సంబంధం పెట్టుకుంటే నీకు సుఖంతో పాటు నాకు డబ్బు వస్తుందని రీనాను వ్యభిచారం చేయ్యాలని పాల్ ఆమె మీద ఒత్తిడి చేశాడు. పాల్ తీరుతో రగిలిపోయిన రీనా ఆమె ప్రియుడు పాల్‌ను చంపాలని నిర్ణయించుకుంది. భర్త గంగేష్‌కు ఫోన్ చేసిన రీనా తనను వ్యభిచారం చేయమని పాల్ బలవంతం చేస్తున్నాడని చెప్పింది. ఇదే సమయంలో రీనా, గంగేష్ దంపతులు పాల్‌ను చంపాలని పథకం వేశారు.జనవరి 2వ తేదీ ఉదయం రీనా తన భర్త గంగేష్‌ను పాల్ ఇంటికి పిలిపించింది. ఆ రాత్రి ఆమె పాల్ మత్తు మందు కలిపి భోజనం పెట్టింది. తరువాత భర్త గంగేష్ తో కలిసి రీనా ఆమె ప్రియుడు పాల్ గొంతకు చీర, వైర్‌తో గొంతు బిగించి హత్య చేసిశారు.

బైక్ లో ప్రియుడి శవం తీసుకెళ్లి ?
పాల్ ను హత్య చేసిన తరువాత గంగేష్ అతని స్నేహితుడు బిజోయ్ కుమార్‌కు ఫోన్ చేసి చిన్నారి ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అతన్ని పిలిచాడు. అతని మాటలు నమ్మి వెంటనే ద్విచక్రవాహనంపై పాల్ ఇంటికి వచ్చిన బిజోయ్ ఇంట్లో పాల్ మృతదేహాన్ని చూసి హడలిపోయాడు. మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని దంపతులు బిజోయ్ కి మనవి చేశారు. మొదట్లో సహాయానికి నిరాకరించిన బిజోయ్ తరువాత రీనా, గంగేష్ దంపతుల రోదనలు చూసి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. బిజోయ్, గంగేష్ పాల్ మృతదేహాన్ని బైక్ మద్యలో పెట్టుకుని తీసుకుని దాదాపు ఆరు కి.మీ. దారిన పోయి నైస్ రోడ్డులో పడేసి పరారయ్యారు.

రాత్రికి రాత్రి శివమొగ్గకు పరార్
పాల్ మృతదేహాన్ని నైస్ రోడ్డులో పారేసిన తరువాత గంగేష్, అతని భార్య రీనా కలిసి టాటా ఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రి ఇంటిని ఖాళీ చేసి బెంగళూరు వదిలి శివమొగ్గలోని శికారీపుర చేరుకున్నారు. మరుసటి రోజు నైస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పాల్‌ది అని పోలీసులు విచారణలో తెలిసింది. పాల్ ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు టాటా ఏస్ వాహనంలో ఇంటిలోని వస్తువులు నింపుకుని వెళ్లిన విషయం గుర్తించారు. టాటా ఏస్ డ్రైవర్‌ను సంప్రదించి ఆరా తీస్తే శికారిపుర చిరునామా చెప్పాడు. డ్రైవర్ ఇచ్చిన అడ్రస్ తో బెంగళూరు పోలీసులు శికారిపుర వెళ్లి రీనా, గంగేష్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

నా ప్రియుడు ఏం చేశాడో మీకు తెలుసా ?
డబ్బుల కోసం మగవాళ్లతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, వ్యభిచారం చెయ్యాలని తన ప్రియుడు పాల్ బలవంతం చేస్తున్నాడని, అందుకే భర్తతో కలిసి అతన్ని హత్య చేసి బైక్ లో మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి పారిపోయామని రీనా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రీనా, ఆమె భర్త గంగేష్, అతని స్నేహితుడు బిజోయ్ కుమార్ లను అరెస్టు చేశారు. ఎవరి మోజులో పడిందే అతన్నే భర్తతో కలిసి భార్య హత్య చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications