Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, కాలువలో శవాన్ని పడుకోపెట్టిన భర్త, ఎస్కేప్ !

పంజాబ్/ చండీగఢ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. సంవత్సరం క్రితం దంపతులకు బిడ్డ పుట్టింది. భార్య, బిడ్డలతో జీవితాంతం సుఖంగా ఉండాలని భర్త ఎన్నోకలలు కన్నాడు. ఉద్యోగం చేస్తున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉంటున్నాడు. ఇటీవల భార్య తీరులో మార్పులు వస్తున్నాయని భర్తకు అనుమానం వచ్చింది. ఉద్యోగానికి వెలుతున్నానని చెప్పి బయటకు వెలుతున్న భర్త సీక్రేట్ గా అతని భార్య మీద నిఘా వేశాడు. వేరే సిటీలో ఉంటున్న యువకుడితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త తెలుసుకున్నాడు. బయటకు వెళ్లిన భర్త అనుకోకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త ఆమెను చితకబాదేశాడు. ఆ సమయంలో జరిగిన గొడవ కారణంగా భర్త అతని భార్యను చంపేశాడు. పోలీసు కేసు అవుతుందని భయపడిన భర్త కారులో అతని భార్య శవాన్ని తీసుకెళ్లి సిటీ సమీపంలోని నది కాలువలో విసిరేసి చేతులు దుపులుకున్నాడు.

 గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు

గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు

చండీగఢ్ లో చరణ్ జిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం పంజాబ్ కు చెందిన రూబీ పాండే అలియాస్ రూబీ అనే మహిళతో చరణ్ జిత్ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన రూబీ పాండేని వివాహం చేసుకున్న చరణ్ జిత్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

 చండీగఢ్ లో కాపురం

చండీగఢ్ లో కాపురం

చరణ్ జిత్, రూబీ పాండే దంపతులు చండీగఢ్ లోని సెక్టార్ 45లోని ఖరార్ ఏరియాలోని ఎక్స్ ఫ్లోర్స్ 1 సోసైటీలో కాపురం పెట్టారు.

సంవత్సరం క్రితం చరణ్ జిత్, రూబీ పాండే దంపతులకు కొడుకు పుట్టాడు. భార్య రూబీ పాండే, బిడ్డలతో జీవితాంతం సుఖంగా ఉండాలని చరణ్ జిత్ ఎన్నోకలలు కన్నాడు.

 భార్య తీరులో మార్పులు వస్తున్నాయని ?

భార్య తీరులో మార్పులు వస్తున్నాయని ?

ఉద్యోగం చేస్తున్న చరణ్ జిత్ ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉంటున్నాడు. చరణ్ జిత్ భార్య రూబీ పాండే ఆమె కొడుకుతో కలిసి ఇంట్లోనే ఉంటున్నది. ఇటీవల భార్య రూబీ పాండే తీరులో మార్పులు వస్తున్నాయని ఆమె భర్త చరణ్ జిత్ కు అనుమానం వచ్చింది. ఉద్యోగానికి వెలుతున్నానని చెప్పి బయటకు వెలుతున్న చరణ్ జిత్ సీక్రేట్ గా అతని భార్య రూబీ పాండే మీద నిఘా వేశాడు.

 లూథియానాలో ప్రియుడు

లూథియానాలో ప్రియుడు

లూథియానా సిటీలో ఉంటున్న యువకుడితో తన భార్య రూబీ పాండేకి అక్రమ సంబంధం ఉందని చరణ్ జిత్ తెలుసుకున్నాడు. వివాహం చేసుకుని తనను తన భార్య రూబీ పాండే మోసం చేస్తోందని చరణ్ జిత్ రగిలిపోయాడు. సమయం చూసి తన భార్య రూబీ పాండేకి బుద్ది చెప్పాలని చరణ్ జిత్ డిసైడ్ అయ్యాడు.

 భార్యను చంపేసిన భర్త

భార్యను చంపేసిన భర్త

మార్చి 9వ తేదీన బయటకు వెళ్లిన చరణ్ జిత్ అనుకోకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్య రూబీ పాండేని, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న చరణ్ జిత్ ఆమెను చితకబాదేశాడు. ఆ సమయంలో జరిగిన గొడవ కారణంగా చరణ్ జిత్ అతని భార్య రూబీ పాండేని చంపేశాడు. పోలీసు కేసు అవుతుందని భయపడిన చరణ్ జిత్ అతని కారులో అతని భార్య రూబీ పాండే శవాన్ని తీసుకెళ్లి సిటీ సమీపంలోని మోరిండా సమీపంలోని ఖన్త్ మన్సూర్ నది కాలువలో విసిరేసి చేతులు దుపులుకున్నాడు.

 భార్య సీక్రేట్ మ్యాటర్ మొత్తం చెప్పిన భర్త

భార్య సీక్రేట్ మ్యాటర్ మొత్తం చెప్పిన భర్త

రూబీ పాండే కనపడటం లేదని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య రూబీ పాండే కనపడటం లేదని చరణ్ జిత్ పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇన్ని రోజులు సమాచారం ఇవ్వలేదని అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 9వ తేదీన తన భార్య రూబీ పాండేని తానే హత్య చేశానని చరణ్ జిత్ అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి సతీందర్ సింగ్ మీడియాకు చెప్పారు. నది కాలువలో రూబీ పాండే శవం కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+