girlfriend: భర్త ఇంటికి వెలుతున్నానని తల్లికి చెప్పి లవర్ తో అక్కడికి వెళ్లింది, పీస్ పీస్ చేసిన ప్రియుడు !
తన భర్త ఇంటికి వెలుతున్నానని తల్లిదండ్రులకు చెప్పిన యువతి ఇంటి నుంచి బయలుదేరింది. అంతే యువతి మాయం అయ్యింది. కొన్ని రోజులకు యువతి బట్టలు, ఆమె శరీరంలోని ముక్కలు అక్కడక్కడా కనిపించాయి.
జైపూర్/రాజస్థాన్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రేమికులు పెళ్లికి ముందే ఎంజాయ్ చేశారు. మ్యాటర్ తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో ఆమె పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకున్న యువతి ఆమె భర్తతో కాపురం చేస్తూ అత్తారంటిలో ఉంటున్నది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన యువతి కొన్ని రోజులు అక్కడే ఉంది. తరువాత తన భర్త ఇంటికి వెలుతున్నానని తల్లిదండ్రులకు చెప్పిన యువతి ఇంటి నుంచి బయలుదేరింది. అంతే యువతి మాయం అయ్యింది. భర్త, యువతి కుటంబ సభ్యులు రెండు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కొన్ని రోజులకు యువతి శరీరంలోని ముక్కలు అక్కడక్కడా కనిపించడం కలకలం రేపింది.

వేరే అబ్బాయితో ప్రియురాలి పెళ్లి
రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని పలాసర్ గ్రామానికి చెందిన గుడ్డి అలియాస్ గుడియా కౌర్ అనే యువతి, పక్క గ్రామంలో నివాసం ఉంటున్న మరో యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రేమికులు పెళ్లికి ముందే ఎంజాయ్ చేశారు. మ్యాటర్ తెలుసుకున్న గుడియా కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో ఆమె పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకున్న గుడియా ఆమె భర్తతో కాపురం చేస్తూ అత్తారంటిలో ఉంటున్నది.

పెళ్లి అయినా ప్రియుడితో రొమాన్స్
వివాహం చేసుకున్న తరువాత కూడా గుడియా ఆమె ప్రియుడు అనోబ్రమ్ తో టచ్ లో ఉంది. ప్రియురాలు గుడియాతో టేస్ట్ మరిగిన అనోబ్రమ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. పెళ్లి జరిగిన తరువాత పాత ప్రియుడు అనోబ్రమ్ ను మరిచిపోలేదని గుడియా పుట్టింటికి వెళ్లినప్పుడు సీక్రేట్ గా ఆమె ప్రియుడితో తిరుగుతూ రొమాన్స్ చేసింది. అయితే గుడియా వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులు, భర్తకు తెలీలేదు.

పుట్టింటికి వెళ్లి మాయం అయ్యింది
జనవరి 10వ తేదీన గుడియా ఆమె పుట్టింటికి వెళ్లింది. జనవరి 20వ తేదీ వరకు అక్కడే ఉన్న గుడియా అదే రోజు తాను తన భర్త ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుంచి ఒక్కటే వెళ్లిపోయింది. అయితే భర్త ఇంటికి వెళ్లకుండానే గుడియా అదృశ్యమైంది. గుడియా సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. మరుసటి రోజు వరకు గుడియా కోసం ఆమె భర్త, ఆమె కుటుంబ సభ్యులు గాలించారు.

గుడియా బట్టలు, జుట్టు, శరీరంలోని ముక్కలతో షాక్
గుడియా ఆచూకిలేకపోవడంతో షాక్ కు గురైన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో, భర్త అతను నివాసం ఉంటున్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గుడియా కనపడటం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిద కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నాగౌర్‌లోని మాల్వా రోడ్ ప్రాంతంలో అదృశ్యమైన మహిళ గుడియా బట్టలు, ఆమె తల జుట్టుతో పాటు కొన్ని శరీర భాగాలు పడి ఉండటంతో పోలీులు హడలిపోయారు. పోలీసుల విచారణలో షాకింగ్ సమాచారం బయటపడింది.

ప్రియుడిని రెండో పెళ్లి చేసుకోవాలని స్కెచ్
హత్యకు గురైన గుడియా పెళ్లికి ముందే స్థానికంగా ఉంటున్న అనోబ్రమ్ అనే వ్యక్తిని ప్రేమిస్తోందని పోలీసులు గుర్తించారు. మరొకరితో వివాహం చేసుకున్న తరువాత కూడా గుడియా ఆమె ప్రియుడు అనోబ్రమ్ తో ప్రేమ కొనసాగిస్తోందని ,ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని పోలీసులు అన్నారు. అయితే గుడియా ఆమె ప్రియుడు అనోబ్రమ్ ను తనను నువ్వు పెళ్లి చేసుకోవాలని నిత్యం ఒత్తిడి చేస్తూ వచ్చిందని పోలీసులు చెప్పారు. అప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేసిన మాజీ ప్రియురాలు గుడియాను మళ్లీ పెళ్లి చేసుకోవడం అనోబ్రమ్ కు ఏమాత్రం ఇష్టం లేదని పోలీసులు అన్నారు.

టార్చర్ తట్టుకోలేక చంపేసిన ప్రియుడు
జనవరి 20వ తేదీన పుట్టింటి నుంచి బయలుదేరిని గుడియా ఆమె భర్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా ప్రియుడు అనోబ్రమ్ వద్దకు వెళ్లింది. పెళ్లి విషయంలో గుడియా, అనోబ్రమ్ ల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ప్రియురాలు గుడియాను హత్య చేసిన అనోబ్రమ్ తరువాత పోలీసులకు చిక్కకూడదని ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా కోసి బావిలె ముళ్ల పొదల్లో అటవి ప్రాంతంతో పాటు పలుచోట్ల పడేశాడని పోలీసులు అన్నారు.

హడలిపోతున్న ప్రజలు
హంతకుడు అనోబ్రామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విసిరివేయబడిన గుడియా శరీర భాగాలను వెలికితీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది ఢిల్లీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గర్ల్ శ్రద్ధా వాకర్ ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ హత్య ఆమె శవాన్ని చేసి 35 ముక్కలుగా నరికేసి విసిరివేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రియురాళ్లను ఆమె ప్రియులే ఇలా దారుణంగా చంపేసి శవాలను ముక్కలు ముక్కలుగా నరకడంతో ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications