Monsoon: నైరుతి రుతుపవనాలొచ్చేశాయ్ ! వాతావరణశాఖ చల్లటి కబురు.. !
వేసవిలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం ఇవాళ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల రాక ప్రారంభమైనట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలిపింది. దీంతో మరో వారం, రెండు వారాల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురవబోతున్నాయి.
మే 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలోకి విస్తరించినట్లు భారత వాతావరణ విభాగం ఇవాళ ప్రకటించింది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్-నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది రుతుపవన వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని మరో కీలక విషయాన్ని కూడా భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సాధారణంగా దేశంలో వర్షపాత దీర్ఘకాలిక సగటు 880 మి.మీ. ఉండగా.. ఈసారి ఇది 105 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, దిగువ వాతావరణ స్థాయిలలో పశ్చిమ గాలుల ప్రభావం, ఎగువ వాతావరణ స్థాయిలలో తూర్పు గాలుల ప్రభావం దక్షిణ ద్వీపకల్పంలో దాదాపు 40 రోజుల పాటు ఉరుములతో కూడిన ముందస్తు వర్షపాతం ఉంటాయని తెలిపింది. అలాగే వాయువ్య పసిఫిక్ మహాసముద్రంపై సాధారణం కంటే ఎక్కువ పీడనం ఉండటం వంటి అంశాలు రుతుపవనాల రాకను సూచించే ముఖ్య కారకాలు అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో వాతావరణ పరిస్ధితులు ముందస్తు రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ విభాగం ఛీఫ్ తెలిపారు. వీటి ప్రభావంతో కేరళలో రుతుపవనాల ప్రారంభం ఖాయమని ఆయన తెలిపారు. ప్రస్తుత గాలి పరిస్థితులు చూస్తుంటే రుతుపవనాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. భారత వాతావరణ నమూనా, అనేక ఇతర ప్రపంచ వాతావరణ నమూనాలు రెండూ ఈ విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నాయన్నారు. ఈ లెక్కన చూస్తే జూన్ 1 కి ముందే కేరళలో వర్షాల రాక ఖాయంగా తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications