వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు: ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో ఏప్రిల్ 26-30 వరకు వాతావరణం తడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ, రాయలసీమలో వర్షాలు, పిడుగులు పడే అవకాశం

తెలంగాణ, రాయలసీమలో వర్షాలు, పిడుగులు పడే అవకాశం


ఏప్రిల్ 26 నుంచి తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గ్యాంగ్‌టక్, పశ్చిమబెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, రాయలసీమ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుమెరుపులతో కూడి వర్షాలు, పడిగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీ, తెలంగాణ, సీమలో వర్షాలు, ఈదురుగాలులు

ఏపీ, తెలంగాణ, సీమలో వర్షాలు, ఈదురుగాలులు

ఇక గుజరాత్, ఒడిశా తీరం ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో ఏప్రిల్ 27న ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్‌ప్రదేశ్, గ్యాంగ్టక్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కోంకణ్, గోవా, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో మోస్తారు వర్షాలతోపాటు పిడుగులు పాడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు


ఏప్రిల్ 28న ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సెంట్రల్ మహారాష్ట్ర, మరఠ్వాడ, తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ కేరళ ప్రాంతాల్లో ఏప్రిల్ 28న భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

29, 30న ఏపీ, తెలంగాణ, సీమలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటు

29, 30న ఏపీ, తెలంగాణ, సీమలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటు

ఏప్రిల్ 29న ఉత్తరాఖండ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేగాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, గల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, రాయలసీమ, కోస్తా, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో ఏప్రిల్ 9న వర్షంతోపాటు పిడుగులు పాడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 30న ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

English summary
The India Meteorological Department (IMD) on Monday predicted a wet spell over several parts of the country, including central, south and northeast India, from April 26 to 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X