IMD: ఈసారి వేసవి ఎలా ఉండబోతోంది ? ఐఎండీ షాకింగ్ అంచనాలు..

భారత్ లో ఈసారి వేసవి ప్రభావం ఎలా ఉండబోతోందన్న దానిపై ఇవాళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన అంచనాలను వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈసారి ఏర్పడబోయే మార్పులు, దేశంలోని పలు ప్రాంతాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోందనే అంశాల్ని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఇవాళ మీడియాకు వెల్లడించారు. ఇందులో జనానికి షాక్ ఇచ్చే పలు అంశాలు ఉన్నాయి.

ఈసారి దేశంలోని మధ్య, ఉత్తర మైదాన ప్రాంతాలు, అలాగే దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ వేసవిలో ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఇవాళ వర్చువల్ గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

IMD warns of lengthy heat waves and highest temperatures this summer

అలాగే మధ్య భారతదేశం, ఉత్తరాన ఉన్న మైదాన ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రెండు నుండి ఎనిమిది రోజులు వడగాల్పులు ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో ఇలాంటి పరిస్దితులు ఉండొచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు దేశంలో 23 రాష్ట్రాలు వడగాల్పుల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది.

మధ్య భారతదేశం, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ అంచనా వేసింది. వడగాల్పుల ప్రభావం ఈసారి పేదలపై అత్యధికంగా ఉంటుందని హెచ్చరించింది. వడగాల్పుల సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్ సమస్యలతో బాధపడుతున్న వారికి గణనీయంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+