ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ధర్మసత్రం కాదు - అమిత్ షా

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను (Immigration bill) లోక్‌సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లును ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు 2025 అని కూడా పిలుస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం అక్రమ వలసలను అరికట్టడం.ఈ బిల్లు పాస్‌పోర్ట్, వీసా, రిజిస్ట్రేషన్, భారతదేశంలోకి ప్రవేశించడానికి, దేశం నుంచి నిష్క్రమించడానికి విదేశీయుల నియంత్రణకు సంబంధించినది. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, విదేశీ పౌరులకు సంబంధించిన నాలుగు పాత చట్టాలు రద్దు చేయబడతాయి. వీటిలో విదేశీయుల చట్టం 1946, పాస్‌పోర్ట్ చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, ఇమ్మిగ్రేషన్ చట్టం 2000 ఉన్నాయి. తాజాగా ఈ ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.విద్య, వ్యాపారం, పరిశోధనల కోసం దేశానికి వచ్చేవారిని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.ఇమ్మిగ్రేషన్, ఫారనర్స్ బిల్లు 2025 దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలను పెంపొందిస్తుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అయితే చొరబాటుదారులకు భారత్‌ ధర్మసత్రం కాదన్నారు. భారత్‌లో అశాంతి సృష్టించే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మయన్మార్ నుంచి రోహ్యింగాలు, బంగ్లాదేశీయులు దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారు.వ్యక్తిగత లాభం కోసం దేశంలో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చొరబాటుదారులు దేశంలో అశాంతిని సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

Immigration Bill 2025 passed by Lok Sabha

ఆరోగ్యం, విద్యా రంగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇండియాను సందర్శించే ప్రతీ విదేశీయుడి గురించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా.. 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సహాయపడుతుందని అమిత్ షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇమ్మిగ్రేషన్, ఫారనర్స్ బిల్లు 2025 ప్రకారం ఇండియాలోకి ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి నకిలీ పాస్‌పోర్ట్, వీసాను ఉపయోగిస్తున్నట్లు తేలితే ఏడేళ్ల జైలు శిక్ష మరియు రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+