వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్టీలకు 'కీలకమే, 'మార్పులు తప్పకపోవచ్చు,

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆయా పార్టీలు కసరత్తుచేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం కోసం బ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆయా పార్టీలు కసరత్తుచేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం కోసం బిజెపి,కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను బుదవారంనాడు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికానున్నాయి.

ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం సమాజ్ వాదీ , బిఎస్ పి లకు ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. అయితే దేశంలో అతి పెద్దదైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు పార్టీలు కసరత్తుచేస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపిలను గెలుచుకొన్న బిజెపి , ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదల ఆ పార్టీ నాయకుల్లో కన్పిస్తోంది. చాలాకాలంగా ఈ రాష్ట్రంలో బిజెపి అధికారానికి దూరమైంది.

 ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం కోసం వ్యూహలు

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం కోసం వ్యూహలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. అయితే సమాజ్ వాదీ పార్టీలో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతోంది. తండ్రీ, తనయులు పార్టీ తనదంటున్నారు. ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని తండ్రీ కొడుకులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేశారు.ఈ ఘటనలు సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో నష్టాన్ని కల్గించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం కూడ ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం సమాజ్ వాదీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు.

 ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపికి కీలకం

ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపికి కీలకం

మరో వైపు బిజెపి ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహలను రచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో బిజెపి సిఎం అభ్యర్థిగా బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని సిఎం గా ప్రకటించలేదు.అయితే ఈ దఫా కేంద్ర మంత్రి మహేష్ కుమార్ శర్మ పేరును సిఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.వరుణ్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్ లు కూడ ఈ సిఎం రేసులో ఉన్నారు.బిఎస్ పి అధినేత్రి మాయావతి కూడ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఐదేళ్ల క్రితం ఆ పార్టీ యూపిలో అధికారాన్ని కోల్పోయింది. అయితే సమాజ్ వాదీ పార్టీ లో చోటుచేసుకొన్న ఘటనలు ఇతర పార్టీలకు కలిసివచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడ ఉంది.

 పంజాబ్ లో సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులేనా

పంజాబ్ లో సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులేనా

పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం అకాలీదళ్ బిజెపి సంకీర్ణంలో ప్రభుత్వం కొనసాగుతోంది.2012 నుండి శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే వరుసగా పదేళ్ళ పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వయ పాలనను కొనసాగించిన ప్రజలు మరోసారి పట్టం కడుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.అయితే కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ఎన్నికల్లో సర్వశక్తులను ఒడ్డేందుకు సన్నద్దమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని చూస్తున్నారు.అయితే పాలక పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలు సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులను తెచ్చిపెట్టింది.అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ కు ఈ రాష్ట్రం నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కాయి.ఈ ఎన్నికల్లో ఆప్ కూడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

 మిణిపూర్ మణిహరం ఎవరికీ దక్కెనో

మిణిపూర్ మణిహరం ఎవరికీ దక్కెనో

మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓక్రం ఇబోబీ సింగ్ ప్రస్తుతం ఈ రాష్ట్రముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో అధికారం కోసం బిజెపి ప్రయత్నాలుచేస్తోంది. గత ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి అదే ఊపుతో మణిపూర్ లో కూడ కాలుమోపుతామనే ఆశతో ఉంది.అయితే చాలా కాలంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

సంప్రదాయాన్ని గోవా ప్రజలు కొనసాగిస్తారా

సంప్రదాయాన్ని గోవా ప్రజలు కొనసాగిస్తారా

గోవాలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉంది. అయితే ఇదే సంప్రదాయం కొనసాగుతోందా లేదా అనేది చర్చ సాగుతోంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొన్నాడు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేస్తున్నాడు. గోవాలో మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ అనే ప్రాంతీయ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈ రాష్ట్రంలో బిజెపి బలపడింది. బిజెపి పాలనపై వ్యతిరేకత వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపుకు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు.
 ఉత్తరాఖండ్ మార్పు తెస్తోందా

ఉత్తరాఖండ్ మార్పు తెస్తోందా

ఉత్తరా ఖండ్ ఎన్నికల్లో మార్పు తప్పకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి.అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ్ బహుగుణ పార్టీ పిరాయించాడు. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. అయితే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో కేంద్రం కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన హరీష్ రావత్ అధికారంలో ఉన్నారు.అయితే ఎంఏల్ఏలను ప్రలోభాలు పెట్టారని సిబిఐ కేసు కూడ ఇటీవలనే నమోదైంది. ఈ దఫా ఎన్నికల్లో మార్పులు కన్పించే అవకాశాలున్నాయని ప్రచారం కూడ ఉంది.

English summary
important to political parties five state elections, who wil gain who will loss in elections voters will decide in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X