ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతి ఐజీఎస్టీ విధించడం రాజ్యాంగ విరుద్ధం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌పై కేంద్రం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(ఐజీఎస్టీ) విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వ్యక్తిగత ఉపయోగం కోసమా? లేదా ఇతరులకు గిఫ్టుగా ఇచ్చేందుకు దిగుమతి చేసుకుంటున్నారా? అనే విషయాలను గమనించకుండా.. దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై ఐజీఎస్టీ విధిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ మే 1న జారీ చేసిన నోటిఫికేషన్‌ను జస్టిస్ రాజీవ్ శక్ధర్, జస్టిస్ తల్వంట్ సింగ్ లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.

వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై ఐజీఎస్టీ 12 శాతం వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా దిగుమతి చేసుకుంటున్న ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వారు వ్యక్తిగతంగానే ఉపయోగించుకుంటున్నారని, వాణిజ్యపరంగాని వ్యాఖ్యానించింది.
Recommended Video
వ్యక్తిగత ఉపయోగం లేదా ఇతరులకు గిఫ్టుగా ఇచ్చేందుకు దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై ఐజీఎస్టీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, కేంద్రం ఇప్పటికే పలు పరికరాలు, కరోనా ఔషధాలపై దిగుమతి సుంకం నుంచి మినహాయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications