వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో ఇమ్రాన్ శ‌కం ఆరంభం.. భార‌త్ తో స‌మ‌స్య‌లు ఝ‌టిల‌మా..! స‌ర‌ళ‌మా..!!

|
Google Oneindia TeluguNews

నేడు అంతర్జాతీయ రాజ‌కీయ నాయ‌కుల ద్రుష్టి పాకిస్థాన్ పైన కేంద్రీక్రుత‌మైంది. పాకిస్థాన్ లో గ‌ద్దెనెక్క‌బోయే ఇమ్రాన్ ఖాన్ పొరుగు దేశాల‌తో నెర‌ప‌బోయే రాజ‌కీయ సంబందాలు ఏవిధంగా ఉండ‌బోతున్నాయ‌నే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. ముఖ్యంగా భార‌త్ తో ఇమ్రాన్ ఎలాంటి ఎజెండా క‌లిగి ఉంటాడ‌నే అంశం ప‌ట్ల ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక క్రీడా కారుడిగా ఇమ్రాన్ ఖాన్ భార‌త్ లోని అన్నిరాష్ట్రాలను సంద‌ర్శించారు. భార‌త్ గొప్ప‌త‌న‌మైన భిన్న‌త్వంలోని ఏక‌త్వం సిద్దాంతం గురించి కూడా ఆయ‌న‌కు బాగా తెలుసు. పాక్ ఆరాద్య దేవుడు మ‌హ‌మ్మ‌ద్ జిన్నా ను అమితంగా ఇష్ట‌పడే ఇమ్రాన్ ఖాన్ జ‌మ్మూ-కాశ్మీర్ ప‌ట్ల ఎలాంటి వైఖ‌రితో ఉంటార‌నే అంశం ఉత్సుక‌త‌కు గురిచేస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ ది ఎలాంటి వైఖ‌రి..? క్రికెట్ లో చూపించిన స్పూర్తి రాజ‌కీయాల్లో ఉంటుందా..!

ఇమ్రాన్ ఖాన్ ది ఎలాంటి వైఖ‌రి..? క్రికెట్ లో చూపించిన స్పూర్తి రాజ‌కీయాల్లో ఉంటుందా..!

ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయంటే పాకిస్తాన్ లో చాలా మంది రగిలిపోతుంటారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరు. ఆర్మీకి అత్యంత ప్రియుమైన క్రికెట‌ర్ కాశ్మీర్ తమదేనని అడ్డంగా వాదించే స్వ‌భావం గ‌ల‌వాడే.. అందుకే ఆయనంటే పాక్ మిలటరీకి చాలా ఇష్టం. నవాజ్ షరీఫ్ లా కాస్తో కూస్తో కూడా రాజకీయ చాతుర్యం వున్నా వాడు కాదు ఇమ్రాన్. పూర్తిగా మిలటరీ బాస్ లు చెప్పే మాటలకు జీ హుజూర్ అనే రకం! మరిక ముందు ముందు మన దేశం ఎలా వుండాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భారత్, పాక్ వేరు వేరు దేశాలైనా గవర్నమెంట్ మార్పు జరిగితే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరి ప్రభావం వుంటుంది. అందుకే, పాకిస్తాన్ పాలకులు ఏదో మూలన కాంగ్రెస్ పాలన దిల్లీలో వుండాలని కోరుకుంటారు. అలాగే, ఇండియాలో నేరుగా ఆర్మీ పాలన కంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం పాలన వుండాలని భార‌త్ కూడా కోరుకోవ‌డం స‌హ‌జం.

క‌లిసుందాం రా.. అంటాడా...! క‌వ్విస్తాడా..!!

క‌లిసుందాం రా.. అంటాడా...! క‌వ్విస్తాడా..!!

ఇప్పుడున్న పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ లాంటి నేతే పాకిస్తాన్ పీఎంగా వుండాలని ఇండియా ఆశించింది. కానీ, అలా జరిగే సూచనలు ఎంత మాత్రం లేవు. అలా జరిగినా, జరగక పోయినా ఎన్నికల్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని అతనే ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు. ఇక ఇమ్రాన్ ప్రధాని అంటే నేరుగా ఆర్మీనే పాలన చేస్తోందని భావించాలని విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి. భార‌త్ లో మోదీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ పక్క దేశానికి అసహనంగానే వుంది. యూపీఏ సర్కార్ హయాంలో కాశ్మీర్ లోనే కాదు భారతదేశం లోపల కూడా పాక్ అరాచకాలు నిరాటంకంగా సాగాయి. మోదీ నిర్ణయాలు ఎలా వున్నా., రక్షణ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త అద్భుతమే! ఏకంగా ముంబై మహానగరంలో ఊచకోత కోసిన పాక్ ఇప్పుడు ఇండియాలో ఒక్క బాంబు పేల్చలేకపోతోంది.

బీజెపి ఎజెండా స్వాగ‌తిస్తారా...! తిర‌స్క‌రిస్తారా..!! నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

బీజెపి ఎజెండా స్వాగ‌తిస్తారా...! తిర‌స్క‌రిస్తారా..!! నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

కేవలం కాశ్మీర్ లో రాళ్ల దాడి వ్యూహంతో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాకిస్తాన్ పాల్ప‌డుతోంది. దానికి కూడా అప్పుడ‌ప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. భార‌త్ భద్రతదళాలు ఎన్ కౌంటర్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని అంతం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కాలుపెట్టి ప్రతీకారం కూడా తీర్చుకున్నారు భార‌త జవాన్లు. ఇలాంటి పరిస్థితి వల్లే పాక్ కు భారత్ లో ధృఢమైన ప్రభుత్వం వుండటం ఇష్టం ఉండ‌దు. హిందూత్వ ఎజెండాతో సాగే బీజేపీ సర్కార్ అంటే పాక్ మరింత కలవరప‌డిపోతుంటుంది. మోదీ సర్కార్ మీద మంటగా వున్నా పాకిస్తాన్ కు నవాజ్ షరీఫ్ లాంటి రాజకీయ నేత దేశాన్ని నడపటం వల్ల యుద్ద వాతావరణం తప్పుతూ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి పొలిటీషన్ అనుకోటానికి ఎట్టిప‌రిస్తితిలో వీలు లేదు. తన మాజీ రెండో భార్య నుంచి అనేక ప్లేబాయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ అవసరాల కోసం పాక్ ఆర్మీకి పూర్తిగా అమ్ముడుపోయాడు.

కాశ్మీర్ ను క‌బ‌ళిస్తాడ‌నే ప్ర‌చారం.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నుకుంటున్న భార‌త్..

కాశ్మీర్ ను క‌బ‌ళిస్తాడ‌నే ప్ర‌చారం.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌నుకుంటున్న భార‌త్..

నవాజ్ షరీఫ్ ఆర్మీతో కాస్త దూరం పాటించటమే అతడి అరెస్ట్, ప్రస్తుత జైలు జీవితానికి కారణమన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి ఇమ్రాన్ ఆ తప్పు చేయకుండా మిలటరీ అధినేతల చెప్పుచేతల్లో తోకాడిస్తాడు.అంటే, భారత్ ఇమ్రాన్ రూపంలో పాక్ మిలటరీ కుట్రల్ని ఎదుర్కోటానికి సిద్ధంగా వుండాలన్నమాట. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన అంతిమ యుద్ధానికి కూడా భార‌త్ తెగించే వుండాలి. తప్పదనుకుంటే పాక్ ను మోదీ మూడు ముక్కలు చేసైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇమ్రాన్ ఖానే సంయుక్త పాకిస్తాన్ కు చివరి ప్రధాని అయ్యేలా చూడాలి. అదే భారత్ మనః శాంతికి శాశ్వత పరిష్కారం. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్ అదినాయ‌కత్వంలో కాశ్మీర్ రాష్ట్రాన్ని కాపాడుకోవ‌డం కూడా పెను స‌వాళ్ల‌తో కూడుకున్న చ‌ర్యే.. పూర్తి అదికారాలు చేప‌ట్టాక భార‌త్ ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది తేట‌తెల్లం అవుతుంది. ఈ లోపు క‌ద‌న రంగానికి కావాల్సిన వ‌స్తువుల‌ను స‌మ‌కూర్చుకుంటే శ్ర‌య‌స్క‌ర‌మ‌ని భావ‌న వ్య‌క్తం అవుతోంది.

English summary
in Pakistan imran khan era beginning as prime minister. in the recent pakistan general elections imran khan party won majority seats. with the coalition of another parties imran khan becoming new prime minister of Pakistan. the curiacity atmosphere took place around the country that how imran intentions towards India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X