Rent: ఏకంగా రూ.18 వేలు పెరిగిన అద్దె.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
భారత ఐటీ రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బెంగళూరులో అద్దె ఇంట్లో ఉండాలంటే సంవత్సరం అడ్వాన్స్ ముందే ఇవ్వాలి. అందుకే చాలా మంది ఫ్యామిలీలు బెంగళూరుకు వెళ్లడానికి ఇష్టపడవు. తాజాగా బెంగళూరులోని బెల్లందూర్‌లోని ఫ్లాట్ ఓనర్ ప్లాట్ అద్దెను ఏకంగా రూ.18,000 పెంచాడు. దీంతో అందురో రెంట్ కు ఉండే దంపతులు ఉండాలా ఇల్లు కాలి చేయాలా అని ఆలోచించుకుని చివరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ప్లాట్ మారాలని నిర్ణయించుకున్నారు.
36 ఏళ్ల అన్వేసా చక్రవర్తి 2020 ఆగస్టులో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లాక్‌డౌన్ ఉన్నప్పుడు బెల్లందూర్‌లోని 3-BHK ఫ్లాట్‌లో దిగాడు. అద్దె రూ.25 వేలు కాగా ప్రతి ఏటా రూ.1000 చొప్పున పెంచేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే 2022 ప్రారంభంలో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్షీణించడంతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసు రావాలని ఆదేశించాయి. దీంతో ప్లాట్ ఓనర్ చక్రవర్తిని రూ. 35,000 అద్దె ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

"మేము సంవత్సరానికి మా ఒప్పందం ప్రకారం రూ.1000 పెంచుతూ.. ప్రస్తుతం రూ. 27,000 చెల్లిస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. సడెన్ గా రూ.18 వేల అద్దె పెంచడంతో చెల్లించలేక.. కార్మెల్‌రామ్‌లోని చాలా చిన్న 2-BHKకి నెలకు రూ. 18,000 అద్దె చెల్లిస్తున్నట్లు చక్రవర్తి చెప్పారు. గత ఏడాది నుంచి నగరంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ధరలు రెట్టింపు కావడంతో వేడిని ఎదుర్కొంటున్న వందలాది మందిలో చక్రవర్తి కుటుంబం ఒకటిగా నిలిచింది.
బెంగళూరులో సర్జాపూర్ రోడ్డులో వెయ్యి చదరపు అడుగుల సింగిల్ బెడ్‌రూం అద్దె రూ. 27 వేలుగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలు, బెలందూర్, మాన్యత టెక్ పార్క్ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఓ పరిశోధన సంస్థ తెలిపింది. ఇటు మన హైదరాబాద్ లో కూడా అద్దెలు భారీగా పెరిగాయి. సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ రూ.20 వేలకు పైగా ఉంది.












Click it and Unblock the Notifications