వీధికుక్కల స్వైరవిహారం : భోపాల్‌లో ఆరేళ్ల బాలుడి మృతి
భోపాల్ : ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోవడమే ఆ చిన్నారి పాలిట శాపమైంది. మృత్యువులా వెంబడించిన వీధికుక్కలు బాలుడిని వదిలిపెట్టలేదు. పీక్కుతిన్నాయి .. ఇంతలో తండ్రి వచ్చినా .. బాలుడిని కాపాడేందుకు తల్లి పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది.
కుక్కల దాడి .. బాలుడి మృతి
అవాధ్ పురి ప్రాంతంలో సంజు పేరెంట్స్ తో కలిసి ఉంటున్నాడు. నెల క్రితం సంజు తల్లి డెలివరీ అయ్యింది. తండ్రి ఆఫీసుకు వెళ్లగా .. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు కానీ కుక్కలు సంజును చుట్టుముట్టాయి. ఆ బాలుడు పద్మవ్యుహంలో చిక్కిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో తండ్రి ఆఫీసు నుంచి వచ్చి బాలుడి గురించి అడగడం .. ఆడుకుంటున్నారని తల్లి చెప్పింది. అయితే బయటకొచ్చి చూసి ఖంగుతినడం వారి వంతైంది.

కొడుకును కాపాడేందుకు విశ్వప్రయత్నం
సంజును వీధికుక్కలు చుట్టుముట్టాయని చెప్పడంతో ఆ బాలింత తన కొడుకును కాపాడేందుకు పరుగు తీసింది. సంజును కాపాడమని ఆరిచింది. చుట్టుపక్కల వారు వచ్చిన ఫలితం లేకపోయింది. అప్పటికే తీవ్రగాయాలై సంజు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా .. ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications