KGF: ఏటీఎం టెక్నాలజీ పిన్ టూ పిన్ తెలుసు, జస్ట్ రూ. 75 లక్షలు, ఆంధ్రాలో గిర్రున తిరిగేసి కేజీఎఫ్ లో !
చెన్నై/తిరుపతి/కేజీఎఫ్: ఏటీఎం యంత్రాల్లో లక్షల రూపాయలు నిల్వ చేస్తుంటారు. పలు ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల దగ్గర ప్రజలు నిత్యం డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. చోరీలు జరగకుండా ఏటీఎం యంత్రాలు ఉన్న చోట సెక్యూరిటీ గార్డులను పెట్టి ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఏటీఎం యంత్రాల టెక్నాలజీ గురించి పిన్ టూ పిన్ పక్కాసమాచారం తెలుసుకున్న కేటుగాళ్లు లక్షల రూపాయలు లూటీ చేశారు. రెండు రాస్ట్రాలు దాటుకుని తలదాచుకున్న కిలాడీల గురించి పోలీసులకు తెలిసింది. ఒకే రోజు నాలుగు ఏటీఎం యంత్రాల్లో రూ. 75 లక్షలు లూటీ చేసి కేజీఎఫ్ లో తలదాచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఏటీఎం కేంద్రాల మీద నిఘా
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ప్రజలు రద్దీగా ఉండే ఏటీఎం కేంద్రాలు. ప్రజలు తక్కువ వచ్చి వెళ్లే ఏటీఎం కేంద్రాలను కొందరు గుర్తించారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న డబ్బులు లూటీ చెయ్యడానికి అనేక స్కెచ్ లు వేశారు. అనుకున్నట్లు నాలుగు ఏటీఎం కేంద్రాల్లో చొరబడిన నిందితులు లక్షల రూపాయల నగదు చోరీ చేసి మాయం అయ్యారు.

ఇది జరిగింది
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని 4 ఏటీఎం సెంటర్లలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి దొంగలు చొరబడి రూ. 72 ,50, 000 రూపాయలు దోచుకుని దర్జాగా వెళ్లిపోయారు. విషయం తెలుుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు లూటీ అయ్యిందని తెలుసుకున్న సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు స్థానిక ప్రజలు హడలిపోయారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
నిందితులు ఏటీఎం కేంద్రాల దగ్గరకు వాహనంలో వచ్చిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి, దోపిడీకి ముందు దుండగులు ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేశారు. ఏటీఎం కేంద్రాలను నిందితులు లక్ష్యంగా చేసుకున్న దృశ్యాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఏటీఎం యంత్రాల్లో దోపిడీకి 6 మందితో కూడిన ముఠా పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఏటీఎం యంత్రాల టెక్నాలజీ తెలుసు
ఏటీఎం టెక్నాలజీ గురించి పూర్తిగా తెలిసిన ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుణ్ణామలైలో ఏటీఎం యంత్రాల్లో రూ. 75 లక్షలు లూటీ చేసిన ముఠా సభ్యులు అనంతరం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి వెళ్లి అక్కడ ఒక్కరోజు ఉన్నారు. తరువాత చిత్తూరు, పలమనేరు మీదుగా కర్ణాటకలోని కోలార్ జిల్లాకు వెళ్లారని పోలీసులు గుర్తించారు. కోలారు జిల్లాలోని కేజీఎఫ్ తో నిందితులు తలదాచుకున్నారని తమిళనాడు పోలీసులు గుర్తించారు.

కేజీఎఫ్ లో పోలీసుల దాడులు
తిరువణ్ణామలై జిల్లా పోలీసులు ప్రత్యేక బలగాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. కొందరు పోలీసులు కోలారు జిల్లాలోని కేజీఎఫ్ చేరుకుని నేరగాళ్లకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తిరువణ్ణామలై ఏటీఎం కేంద్రాల్లో దోపిడీకి పాల్పడిన హర్యానాలోని మేవాత్‌కు చెందిన ఆసిఫ్, ఆజాద్‌లను తమిళనాడు స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితులను భారీ బందోబస్తుతో తిరువణ్ణామలై తీసుకెళ్లారు. ఈ ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నామని తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications