దారుణం: 5 ఏళ్ళ బాలికపై అత్యాచారం, జననాంగాల్లో చెక్కముక్కలు
న్యూఢిల్లీ: ఐదేళ్ళ చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలోని హిసార్‌లో చోటు చేసుకొంది. అయితే తల్లి, సోదరితో కలిసి నిద్ర పోతున్న చిన్నారిని అపహరించుకెళ్ళి తమ కామవాంఛ తీర్చుకొన్నారు నిందితులు. బాలిక జననాంగాల్లో చెక్క ముక్కలు పెట్టి మరీ దారుణానికి పాల్పడ్డారు దుర్మార్గులు.
పశువాంఛ తీర్చుకొనేందుకు దుర్మార్గులు ఎంత దారుణానికైనా తెగిస్తున్నారు. తల్లి, సోదరితో కలిసి నిద్రపోతున్న చిన్నారిని కిడ్నాప్ చేసి మరీ హర్యానాలో ఈ దారుణానికి పాల్పడడం సంచలనానికి కారణమైంది.
కనీసం మానవత్వం లేకుండా నిందితులు వ్యవహరించారు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం
తల్లి, సోదరి పక్కనే నిద్రపోతున్న ఐదేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.పాపపై అత్యాచారం చేసే సమయంలో నిందితులు అతి దారుణంగా వ్యవహరించారని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో తేలింది.పాప అంతర్గత భాగాల్లో 16సెం.మీ చెక్క ముక్కలు ఉన్నాయి. ఆమె జననాంగంలోకి బలంగా చెక్కముక్కలు పెట్టి క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శరీర భాగాలు చిద్రమయ్యాయి
నిందితులు చిన్నారి శరీర భాగాల్లో చెక్క ముక్కలు దూర్చడం వల్ల ఆమె పేగులు ఛిద్రమయ్యాయి. చిన్నారి భుజాలు, చేతులు, ముఖం మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆమె మెడ దగ్గర విపరీతంగా రక్తస్రావమైందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు.

గ్రామస్థుల ఆందోళన
ఈ ఘటనపై హిసార్ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన వాళ్లని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి దుకాణాలు మూసేసి, రహదారులను దిగ్బంధం చేసి ఆందోళన చేశారు.

నిందితులను అరెస్ట్ చేయాలి
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేయాలని, అప్పటి వరకు చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయబోమని పాప కుటుంబసభ్యులు భీష్మించారు. ఈ ఘటనపై సిట్ విచారణకు అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications