Smart Phone: స్మార్ట్ ఫోన్‍కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన బాలుడు..

ఈ మధ్య కాలంలో పిల్లలు బయట గ్రౌండ్ లో ఆడటం కంటే.. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా గడుపుతున్నారు. చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ బానిసలైపోయారు. 2 ఏళ్ల పిల్లలు మొదలుకొని 25 ఏళ్ల యువకులు కూడా స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చింది మొదలు రాత్రి వరకు పిల్లలు ఫోన్లతోనే ఉంటున్నారు. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడడం వల్ల వారికి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్లు దెబ్బ తిట్టాయని.. మొదడుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

తాజాగా రాజస్థాన్ లో ఓ బాలుడు స్మార్ట్ ఫోన్ కు బానిసై ఆస్పత్రి పాలయయ్యాడు. అల్వార్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు మొబైల్ గేమ్‌లకు బానిసయ్యాడు. రోజంతా బాలుడు ఫోన్ తో గడుపుతుండేవాడు. దీంతో అతను మానసికంగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు. అబ్బాయి తండ్రి రిక్షా నడుపుతాడు. పిల్లాడు స్కూల్‌కి వెళ్లేవాడని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫోన్‌తో ఆడుకోవడం ప్రారంభించాడని అతను చెప్పాడు.

Smart Phone

హోలీ వరకు బాగానే ఉందని, ఆ తర్వాత కళ్లు తిరగడం ప్రారంభించాయని చెప్పాడు. స్థానిక ఆసుపత్రిలో చూపించగా జైపూర్‌కు తీసుకెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. జైపూర్‌లో కూడా బాలుడికి రెండుసార్లు చికిత్స చేయించినట్లు వివరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలుడిని కట్టేసి వెళ్లాల్సి వచ్చిందని కూడా తండ్రి చెప్పాడు. ప్రస్తుతం బాధిత బాలుడు ఏడో తరగతి చదువుతోన్నాడు.

బాలుడు రోజుకు 10 నుంచి 12 గంటలు స్మార్ట్ ఫోన్ లో ఆటలు అడేవాడని బంధువులు తెలిపారు. అతని వద్ద నుంచి మొబైల్ లాక్కుంటే కోపంతో అరిచేవాడని చెబుతున్నారు. 4 నెలలుగా అతని పరిస్థితి బాగోలేదని పేర్కొన్నారు. సో తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారని వారికి ఫోన్లు ఇస్తే.. వాటికి ఫోన్లకు అలవాటు పడతారు జాగ్రత్త..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+