Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా, చైనాలో కరోనా ఉధృతి: రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం, లేఖ

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి గత కొద్ది వారాలుగా చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రా ల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వైరస్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.

ఆదమరిస్తే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే రెండేళ్లనాటి పరిస్తితులు వస్తాయని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

'జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్‌ను సిద్ధం చేయడం చాలా అవసరం"అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.

In View Of Sudden Spurt In Covid Cases In China, US and othre countries: Indian Government Issues Guidelines To States

"అన్ని పాజిటివ్ కేసుల నమూనాలను రోజువారీ ప్రాతిపదికన, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (IGSLలు)కి పంపాలని అభ్యర్థించబడ్డాయి' అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.

గత రెండు నెలలుగా భారతదేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం భారతదేశంలో కేవలం 112 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 3,490కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఆదివారం (డిసెంబర్ 18)తో ముగిసిన వారంలో, దేశంలో కేవలం 12 మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020లో రోజువారీ కోవిడ్ మరణాలు నివేదించడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతి తక్కువ. దేశంలో మూడు రోజులలో సున్నా మరణాలు నమోదయ్యాయి.

అలాగే, వారంలో భారతదేశంలో కనుగొనబడిన కేసులు 1,103కి పడిపోయాయి -- మార్చి 23-29, 2020 నుంచి దేశవ్యాప్తంగా మొదటి లాక్‌డౌన్ విధించిన తర్వాత ఇది వారంవారీ అత్యల్ప సంఖ్య.

In View Of Sudden Spurt In Covid Cases In China, US and othre countries: Indian Government Issues Guidelines To States

అంతకుముందు రోజు, కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఎన్‌టిఎజిఐ ఛైర్మన్ ఎన్‌కె అరోరా మాట్లాడుతూ.. చైనాలో కోవిడ్ -19 పరిస్థితిపై నిశితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని, ఇది ఇన్‌ఫెక్షన్ల తరంగాలను చూస్తోంది. అయితే భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు. "సమర్థవంతమైన వ్యాక్సిన్‌లతో విస్తృతంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నందున" దేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని అరోరా తెలిపారు.

చైనా దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా నిబంధనలను చైనా కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజువారీ కేసులు వెయ్యికిపైగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఎపిడెమియాలజిస్ట్, ఆరోగ్య ఆర్థికవేత్త అయిన ఎరిక్ ఫీగల్-డింగ్.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60 శాతానికి పైగా వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+