ఆదాయపన్ను శాఖ అధికారి కొడుకు కిడ్నాప్: రూ. లక్షలు డిమాండ్, కొత్త బుల్లెట్ లో షికారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆదాయ పన్నుశాఖ అధికారి కుమారుడిని కిడ్నాప్ చేసిన నిందితులు రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఐటీ శాఖలో సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న నిరంజన్ కుమార్ కుమారుడు శరత్ (19) అనే యువకుడు కిడ్నాప్ అయ్యాడని పోలీసులు చెప్పారు.

కిడ్నాప్ చేసిన నిందితులు శరత్ మొబైల్ నుంచి వీడియో తీసి వాట్సాప్ లో నిరంజన్ కుమార్ కు పంపించారు. ఆ వీడియోలో శరత్ మాట్లాడుతూ మీరు ఐటీ దాడులు చేసిన బాధితులు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని విలపించాడు.

Income Tax officer sons kidnaped in Bengaluru

వెంటనే రూ. 50 లక్షలు సర్దుబాటు చేసి కిడ్నాపర్లకు పంపించాలని, లేదంటే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, గురువారం కిడ్నాపర్లు డబ్బు ఎక్కడికి తీసుకురావాలో ఫోన్ చేస్తారని శరత్ విలపించాడు. శరత్ మాట్లాడిన వీడియోను ఐటీ శాఖ అధికారి నిరంజన్ కుమార్ మొబైల్ కు పంపించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శరత్ ను కిడ్నాప్ చేసిన వారి కోసం గాలిస్తున్నారు. గతంలో నిరంజన్ కుమార్ ఎవరెవరి మీద ఐటీ దాడులు చేశారు ? అని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం సాయంత్రం శరత్ కొత్త బుల్లెట్ కొనుగోలు చేశాడు. కొత్త బుల్లెట్ లో షికారుకు వెళ్లిన సమయంలో అతన్ని కిడ్నాప్ చేశారని నిరంజన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax officer sons kidnaped in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి