Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీలో అంతర్యుద్ధం: పార్టీ అధ్యక్షుడి మెడకు లాబీయింగ్ ఉచ్చు: ఓటమితో తలవంపులు

సిమ్లా: వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, పంజాబ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇందులో తొలి అయిదు రాష్ట్రాల కోసం మార్చి-ఏప్రిల్‌లల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ల పోలింగ్ అక్టోబర్-నవంబర్‌లల్లో ఉంటుంది. పంజాబ్ మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి కసరత్తు చేస్తోంది.

మింగుడు పడని ఓటమి..

మింగుడు పడని ఓటమి..

ఇటీవలే ముగిసిన మూడు లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు కావడం సంచలనంగా మారింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోయిందా కాషాయ పార్టీ. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలను నిర్వహించగా.. అన్నింట్లోనూ ఓడింది. కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలుపొందింది.

కమలనాథుల్లో ఆందోళన..

కమలనాథుల్లో ఆందోళన..

ప్రత్యేకించి- హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమిపాలైన తీరు.. కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోంది. అధికారంలో ఉండటం, పైగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం కావడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ హిమాచల్ ప్రదేశ్ శాఖలో అంతర్మథనం మొదలైంది. అదికాస్తా విభేదాలకు దారి తీసింది. అగ్ర నాయకుల మధ్య భేదాభిప్రాయాలకు కారణమైంది. పార్టీలో ఉంటూ కొందరు నాయకులు కాంగ్రెస్‌కు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. వెన్నుపోటు పొడిచారనే ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.

వెన్నుపోటుదారుల వల్లే..

వెన్నుపోటుదారుల వల్లే..


మండీ లోక్‌సభతో పాటు ఫతేపూర్, అర్కి, జుబ్బల్-కట్ఖారి శాసన సభ స్థానాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇది కాస్తా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీసింది. జేపీ నడ్డా సొంత రాష్ట్రం అయినా, అధికారంలో ఉన్నా పార్టీ ఓటమిపాలు కావడానికి వెన్నుపోటుదారులే కారణమని సీనియర్లు పరస్పరం ఆరోపణలను సంధించుకుంటున్నారు. అభ్యర్థలు ఎంపికలోనూ ఘోర తప్పిదాలు చోటు చేసుకున్నాయని, లాబీయింగ్‌కే దీనికి కారణమని మండిపడుతున్నారు.

 లాబీయింగ్ ద్వారా టికెట్లు..

లాబీయింగ్ ద్వారా టికెట్లు..

జనం మద్దతు లేని నాయకులు లాబీయింగ్ చేసి, టికెట్లను తెప్పించుకోగలిగారంటూ సీనియర్లు విమర్శలు చేస్తోన్నారు. మండీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య పోటీ చేశారు. గెలిచారు. జుబ్బల్-కొట్ఖారీలో బీజేపీ అభ్యర్థి నీలం సెరాయిక్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ చేతన్ బ్రాగ్టా అనే అభ్యర్థి బీజేపీ రెబెల్‌గా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. అర్కి, ఫతేపూర్‌లల్లో ఇదే పరిస్థితి. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ జయకేతనాన్ని ఎగురవేసింది.

జనం మద్దతు లేకున్నా..

జనం మద్దతు లేకున్నా..

దీనిపై పార్టీలో అంతర్మథనం మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ఈ దశలో దారుణ ఓటమి పట్ల నాయకులు స్కానింగ్ మొదలు పెట్టారు. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు చేసుకున్నాయని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానమే వారిని ఎంపిక చేసిందంటూ కొందరు రాష్ట్ర నాయకులు స్పష్టం చేస్తోన్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని మరీ టికెట్లను తెచ్చుకున్నారని, అదే కొంపముంచిందని చెబుతున్నారు. దీనికితోడు- కొందరు నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+