హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: 'ఆ విద్యార్థినిని రేప్‌ చేస్తా' అంటూ ఆన్‌లైన్ క్లాసులో ఆగంతుకుడి హంగామా -ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆన్ లైన్

హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతుండ‌గా హ‌ఠాత్తుగా ఓ ఆగంతుకుడు చొర‌బ‌డి ఓ విద్యార్థినిని రేప్ చేస్తాన‌ని బెదిరించాడని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''నాచారంలోని ఓ కాలేజీ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తోంది. దీంతో జూమ్ క్లాస్‌కు సంబంధించిన పాస్‌వ‌ర్డ్‌ను విద్యార్థుల‌కు కాలేజీ యాజ‌మాన్యం ఇచ్చింది.

క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో ఒక రోజు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి.. ఆన్‌లైన్‌లోకి ప్ర‌వేశించారు. ఓ విద్యార్థిని పేరును పేర్కొంటూ ఆమెను రేప్ చేస్తాన‌ని బెదిరించాడు.

ఆ యువ‌తికి అస‌భ్య‌క‌ర‌మైన సందేశాలు పంపాడు. ఆ మ‌రుస‌టి రోజే కాలేజీ యాజ‌మాన్యం పాస్‌వ‌ర్డ్‌ను మార్చేసింది.

పాస్‌వ‌ర్డ్ మార్చిన‌ప్ప‌టికీ ఆగంతుకుడు ఆగ‌లేదు. మ‌ళ్లీ వారి ఆన్‌లైన్ క్లాసుల్లో చొర‌బ‌డ్డాడు. కాలేజీ టీచ‌ర్ జీమెయిల్‌ను హ్యాక్ చేసి.. దాన్నుంచి ప‌లువురికి అస‌భ్య‌క‌ర‌మైన సందేశాలు పంపాడు. ఆ టీచ‌ర్ వ‌ర‌స్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు.

దీంతో క‌ళాశాల యాజ‌మాన్యం రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారని ఆ కథనంలో వెల్లడించారు.

వజ్రం

'కడప జిల్లాలో వజ్రాలు'

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ-4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్‌ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్‌ శాఖలతో ఢిల్లీలో బుధవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు.

మైనింగ్‌ బ్లాక్‌ల నివేదికలను స్వీకరించిన రాష్ట్రాలు ఇక ఆలస్యం లేకుండా వేలాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మైనింగ్‌ రంగాన్ని ఉత్తేజ పరచడానికి వీలుగా దేశంలో ఖనిజ అన్వేషణను వేగవంతం చేస్తోందని వివరించారు. మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్‌ బ్లాక్‌ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్‌ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది.

వైఎస్సార్‌ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) అన్వేషణలో తేలింది.

నెల్లూరు జిల్లా మాసాయపేట పరిధిలో 20 చ.కి.మీ మేర బేస్‌ మెటల్‌ ఉన్నట్లు స్పష్టం చేసింది.

శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చ.కి.మీ, విశాఖపట్నం జిల్లా నందాలో 2.04 చ.కి.మీ, విజయనగరం జిల్లా గరికపేటలో 4.60 చ.కి.మీ, శివన్నదొర వలసలో 4.20 చ.కి.మీ, బుద్ధరాయవలసలో 6.38 చ.కి.మీ విస్తీర్ణంలో మాంగనీస్‌ బ్లాక్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది.

ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్కపల్లెలో 30.23 చ.కి.మీ విస్తీర్ణంలో ఒకటి, అద్దంకివారిపాలెంలో 9.14 చ.కి.మీ విస్తీర్ణంలో మరొకటి మొత్తంగా 2 ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌లు ఉన్నాయని వెల్లడించింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

నివేదా మళ్లీ వార్తల్లోకి...

సోషల్ మీడియా వేదికగా నటి నివేదా థామస్ చేస్తున్న కొన్ని పనులు నిత్యం ఆమెను వార్తల్లో ఉంచుతున్నాయని 'ఆంధ్రజ్యోతి' వార్తా కథనం రాసింది.

''రీసెంట్‌గా ఆవు పాలను స్వయంగా తానే పిండుతోన్న వీడియోను షేర్ చేసి వార్తల్లో నిలిచిన ఈ నటి, మరోసారి అటువంటి వీడియోనే షేర్ చేసి హాట్ టాపిక్ అయింది.

అయితే ఈసారి ఆమె షేర్ చేసిన వీడియో మాములుగా లేదు. జిమ్‌లో తన ట్రైనర్‌ని పైకి ఎత్తి పడేసింది. ట్రైనర్‌తో పోటీకి దిగి.. అతడిని తన భుజాలపైకి ఎత్తి పడేసింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోతో పాటు 'ఇది ఇక్కడే వదిలేస్తున్నాను.. ఈ వీడియో మేకింగ్‌లో మనుషులకు ఎలాంటి హాని జరగలేదు' అని నివేతా చేసిన పోస్ట్‌కు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నార'ని అందులో రాశారు.

భవన నిర్మాణం

ఒంగోలులో 28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం

ఒంగోలు నగరంలో 100 పడకల ఆసుపత్రిని 28 రోజుల్లోనే నిర్మిస్తున్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''ఒంగోలులో 100 పడకలతో సర్వజన ఆసుపత్రి వెనుక 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 28 రోజుల్లో నిర్మాణం పూర్తిచేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ఇప్పటివరకు 15 రోజుల పనులు పూర్తిగా కాగా ఆసుపత్రికి ఒక రూపం వచ్చింది.

మద్రాస్ ఐఐటీ సాంకేతిక సహకారంతో రూ. 3.5 కోట్లతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇది ఏర్పాటు చేస్తున్నారు.

అవసరం లేదనుకుంటే ఈ ఆసుపత్రిని విడగొట్టి వేరే ప్రాంతానికి తరలించొచ్చు.

కోవిడ్ మూడో దశకు సిద్ధం కావడంలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఆసుపత్రిని నిర్మించడం ఇదే తొలిసారని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు చెప్పార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
HYDERABAD: A newcomer's commotion in an online class saying 'I will rape that student'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X