తాలిబన్ల వేగం ఆశ్చర్యానికి గురిచేసింది, భారత్ వైపు వస్తే జవాబు కఠినంగానే: సీడీఎస్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌ల ఆధీనంలోకి ఆప్ఘనిస్థాన్ వెళ్లడంపై భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుంటారనే విషయం ఊహించిందేనని, అయితే, ఇంత వేగంగా ఆధీనంలో తీసుకుంటారనేది ఆశ్యర్యానికి గురిచేసిందని అన్నారు. ఇండియా-యూఎస్ పార్ట్నర్‌షిప్: సెక్యూరింగ్ 21 సెంచరీ అనే అంశంపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ముఖాముకిలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తాలిబన్ ఆక్రమిత ఆప్ఘానిస్థాన్ నుంచి ఏమైన ఉగ్రవాద చర్యలు మొదలై, అవి భారత్ వైపు దూసుకొస్తే.. వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని సీడీఎస్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తోన్న పోరులో క్వాడ్ దేశాలు పరస్పరం సహకారం మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆప్ఘాన్‌ను తాలిబన్లు ఇంత వేగంగా ఆక్రమించుకోవడం, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తమను ఎంతోగానో ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు.

మరో రెండు నెలల తర్వాత ఇలా జరగొచ్చని ఊహించామన్నారు. కానీ, గడిచిన రెండు దశాబ్దాల్లో తాలిబన్ల బృందం ఎటువంటి మార్పూ కనిపించలేదని సీడీఎస్ రావత్ తెలిపారు. ప్రస్తుతం ఆప్ఘాన్ నుంచి వస్తున్న నివేదికలను బట్టి చూస్తే కేవలం వారి భాగస్వామ్య పక్షాల్లో మాత్రమే మార్పు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తాలిబన్ల ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని తెలిపారు. గత 20 ఏళ్ల క్రితం ఉన్న తాలిబన్లే ఇప్పుడు కనిపిస్తున్నారిన జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు.

 India anticipated Taliban takeover but timeline surprised us: CDS Bipin Rawat on Afghanistan crisis

ఆప్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆప్ఘాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయనే విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వ్యూహాలతో భారత్ సిద్ధంగా ఉందని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.

క్వాడ్ దేశాలు ఉగ్ర‌వాదాన్ని అడ్డుకునేందుకు మ‌రింత స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌న్నారు. ఇండో పసిఫిక్​, అఫ్గాన్ పరిస్థితిని ఒకటే కోణంలో చూడకూడదని.. అవి రెండు విభిన్నమైన అంశాలన్నారు. ఈ రెండు ప్రాంతీయంగా భద్రతా సవాళ్లను విసురుతాయని,. కానీ, అవి రెండు విభిన్నమైన సరళరేఖలన్నారు. అవి రెండు ఎప్పటికీ కలవవని రావత్​ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ సహాకారం కీలకం అని పేర్కొన్నారు. కాగా, అమెరికా అడ్మిరల్ జాన్ సీ అక్విలినో మాట్లాడుతూ.. అమెరికాతోపాటు మిత్ర దేవాల పౌరులను ఆప్ఘాన్ నుంచి తరలించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పౌరులను సురక్షితంగా తరలించడంలో భారత్‌తో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Recommended Video

    Hardik Pandya విలాస పురుషులుగా IPL మహిమ, కోట్ల రూపాయల Luxury Life Style || Oneindia Telugu

    కాగా, ఆప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. మహిళలు ఒంటరిగా బయటికి రావొద్దని, వస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక బాలికల విద్య కూడా ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తున్నట్లు తెలిస్తే చాలు వారిని అంతమొందిస్తున్నారు. ఆప్ఘాన్ జాతీయ జెండాను ప్రదర్శించినా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల నివాసాల్లోకి వెళ్లి దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డుకున్నవారిపై ఇష్టారీతిన దాడి చేస్తున్నారు. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే అనేకమంది ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. పలువురు ఇప్పటికే భారత్, అమెరికాతోపాటు, ఇతర దేశాలకు చేరుకున్నారు. కాగా, ఆగస్టు 31 తర్వాత తరలింపును కొనసాగనివ్వమని ఇప్పటికే తాలిబన్లకు అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోగానే సాధ్యమైనంత మందిని తరలింపు చేపడుతున్నాయి అమెరికా సహా పలు దేశాలు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+