చైనాకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన భారత్.. ఏకంగా రూ. 3.50 లక్షల కోట్లతో..!

దేశీయ బ్యాటరీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 'ఇండియా బ్యాటరీ విజన్ 2047' ప్రణాళిక కింద భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రణాళిక కింద $38 బిలియన్లు (రూ. 3.50 లక్షల కోట్లకుపైగా) పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారత్‌ ను బ్యాటరీ తయారీలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో రూపొందించబడింది.

నివేదికల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 'అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్' (ALBM) ను ప్రకటించనుంది. ఈ జాబితా సౌరశక్తి రంగంలో అమలు చేసిన విధానాన్ని పోలి ఉంటుంది. ALBM లో చేరిన తయారీదారులు మాత్రమే ప్రభుత్వ మద్దతుగల ఇంధన నిల్వ ప్రాజెక్టులు, టెండర్లలో పాల్గొనేందుకు అర్హులు. ముఖ్యంగా, ఇది భారత్ దిగుమతి చేసుకునే బ్యాటరీ భాగాలపై, ప్రధానంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే ఒక 'నాన్-టారిఫ్ బారియర్' గా పనిచేస్తుంది.

ALBM వ్యవస్థ జాబితా చేయబడిన తయారీదారులనే ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. డిమాండ్ అగ్రిగేషన్, మౌలిక సదుపాయల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి వంటి చర్యల ద్వారా అధునాతన కెమిస్ట్రీ సెల్ ఉత్పత్తిని, కీలక బ్యాటరీ భాగాల తయారీని ఈ విధానం పెంపొందించనుంది. ఈ ప్రణాళిక కింద 47 గిగావాట్ల (GW) నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

'ఇండియా బ్యాటరీ విజన్ 2047' అనేది మోడీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక విధాన లక్ష్యం. ఇది దేశాన్ని బ్యాటరీ సరఫరా గొలుసులోని అన్ని స్థాయిలలో స్వయం సమృద్ధిని సాధించేలా చేయడమే కాకుండా, విదేశీ ఆధారపడటాన్ని పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖల పర్యవేక్షణలో రూపొందించిన ఈ ప్రణాళిక, మొబిలిటీ (EV), పవర్ గ్రిడ్లు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో 2047 నాటికి 3 టెరావాట్-గంటలు (TWh) బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని సాధించాలని ఉద్దేశించింది.

India Battery Vision 2047 PMModi Announces Massive Investment Boost Domestic Production nd Exports

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ALBM విధానం విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించడాన్ని మరింత కఠినతరం చేస్తుంది. ఇది బ్యాటరీ భాగాల కోసం చైనాపై భారత్ యొక్క అధిక ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. తొలుత ఇతర బ్యాటరీ భాగాల తయారీపై దృష్టి పెట్టి, క్రమంగా సెల్ తయారీని తప్పనిసరి చేయనున్నారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్థానికీకరణ నిబంధనల ముసాయిదాను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+