వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో మళ్లీ అలజడి: చైనాతో 12వ రౌండ్ సైనిక చర్చలు -విజయ్ దివత్ తర్వాతేనన్న భారత్

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గతంలో తూర్పు లదాక్, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కవ్వింపులకు పాల్పడిన చైనా.. తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దులో దూకుడు పెంచింది. పరిస్థితి మరింత జఠిలంగా మారకముందే, చర్చల ద్వారా డ్రాగన్ ను నిలువరించాలని భారత్ డిసైడైంది. ఈ క్రమంలో..

పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్

భారత్, చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ గాడినపడ్డాయి. సరిహద్దులో శాంతి పునరుద్ధరణ, సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియపై చివరిసారిగా ఏప్రిల్ నెలలో రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు జరిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లోసారి చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే, ఈ 12వ రౌండ్ చర్చల తేదీపై స్వల్ప మథనం జరిగింది..

India, China likely to hold 12th round of military talks soon, activity along LAC in Uttarakhand

సరిహద్దు స్థితిగతులపై, సైనిక ఉపసంహరణపై 12వ రౌండ్ చర్చలను ఈనెల 26వ తేదీనే నిర్వహించుదామని చైనా సైనిక అధికారులు ప్రతిపాదించారని, అయితే, కార్గిల్ యుద్దంలో గెలుపునకు గుర్తుగా భారత్ నిర్వహించే విజయ్ దివస్ కూడా అదే తేదీ కావడం, ఆ రోజు సైన్యం వేడుకల్లో పాల్గొనాల్సిన దరిమిలా మరొక తేదీలో చర్చలు చేద్దామని భారత అధికారులు సూచించారని విశ్వసనీయంగా తెలిసింది. 12వ రౌండ్ చర్చలకు సంబంధించి కొత్త తేదీల ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా,

viral video: నిర్మల్ రోడ్లపై చేపల వేట -పరిస్థితిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ -మరో 24 గంటలు..viral video: నిర్మల్ రోడ్లపై చేపల వేట -పరిస్థితిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ -మరో 24 గంటలు..

ఉత్తరాఖండ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. బరాహోతి సమీపంలో దాదాపు 40 మంది చైనా జవాన్లు గస్తీ చేపట్టారు. సుమారు 6 నెలల తర్వాత చైనా తన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్టు భారత అధికారులు ధ్రువీకరించారు. తాజా పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

English summary
India and China are likely to hold the 12th round of military talks on the situation in eastern Ladakh and the Line of Actual Control (LAC) "very soon", media reports. China had suggested that the talks should be held on July 26. However, India has asked it to work out fresh dates as the Indian Army would be occupied with events related to the Kargil Vijay Diwas at this time, the reports said. The Chinese military has increased its activities along the Line of Actual Control (LAC) in the Barahoti area of Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X