కరాళనృత్యం: 40 వేలకు చేరువగా మరణాలు: ఏ మాత్రం తగ్గని ఉధృతి: అరలక్షకు పైగానే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత పెరిగింది. అదే దూకుడును, అదే స్పీడును కొనసాగిస్తోంది కరోనా మహమ్మారి. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు పరంపరలో ఏ మాత్రం మార్పు కనిపించట్లేదు. మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించట్లేదు. మరణాల సంఖ్య భారీగా కొనసాగుతుండటం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కొద్దిరోజులుగా 700లకు పైగా నమోదవుతోంది. రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా రెండురోజులు 800లకు పైగా నమోదు అయ్యాయి.

కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 40 వేలకు చేరువ అయింది. ఇప్పటిదాకా 39,795 మంది కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,509 కేసులు వెలుగులోకి వచ్చాయి. 857 మంది మరణించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19 లక్షలను దాటింది. ఇప్పటిదాకా 19,08,255 కేసులు నమోదు అయ్యాయి. 39,795 మంది మరణించారు. ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే.. ఇంకో 24 గంటలు గడిచే సరికి కరోనా మరణాలు 40 వేలను దాటుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 India COVID 19 tally crosses 19 lakh mark with single-day spike of 52,509 new cases

డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 12,82,216 లక్షలకు చేరుకుంది. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,244గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. కాాగా- దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి మంగళవారం నాటికి మొత్తం రెండు కోట్ల మార్క్‌ను దాటింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల్లో ముమ్మరంగా కరోనా పరీక్షలు నమోదవుతున్నాయి.

రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పెద్దసంఖ్యలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధాని, తెలంగాణల్లో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో కొద్దిగా తగ్గుముఖం కనిపించింది. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే.. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతోన్న కేసుల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదవుతోంది. అదే సమయంలో ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనా తన కల్లోలాన్ని కొనసాగిస్తూనే వస్తోంది.

Recommended Video

    టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+