కొత్త సీన్లు యాడ్ చేసిన తర్వాత పెద్ది వసూళ్లు తగ్గాయి!
బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోయిన 'పెద్ది' చిత్రం, మూడో వారంలోకి అడుగుపెట్టేసరికి తీవ్రంగా నెమ్మదించింది. సాధారణంగా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గడం సహజమే అయినప్పటికీ, ఈ సినిమా వసూళ్లు మాత్రం రోజురోజుకూ భారీగా పడిపోతుండటం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. థియేటర్లలో రన్ తగ్గుతున్న తరుణంలో, ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పించేందుకు చిత్రబృందం చేసిన తాజా ప్రయోగం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.
ఫలించని కొత్త సీన్ల వ్యూహం
మూడో వారంలో రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు ఆకర్షించడమే లక్ష్యంగా చిత్రబృందం ఒక కౌంటర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త సీన్లను థియేట్రికల్ ప్రింట్‌కు అదనంగా యాడ్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ 'ఎక్స్‌టెండెడ్ వెర్షన్' ద్వారా వసూళ్లను మళ్లీ పెంచవచ్చని మేకర్స్ గట్టిగా భావించారు. కానీ, ఈ కొత్త సీన్లు యాడ్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో ఎలాంటి ఉత్సాహం కనిపించలేదు సరే కదా.. వసూళ్లు మరింత క్షీణించాయి.

15వ రోజు కలెక్షన్లలో భారీ డ్రాప్
దేశవ్యాప్తంగా ఇంకా 3,769 షోలు ప్రదర్శితమవుతున్నప్పటికీ, థియేటర్లలో ఆక్యుపెన్సీ మాత్రం గణనీయంగా పడిపోయింది. 15వ రోజు గురువారం నాడు ఈ చిత్రం ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేయగలిగింది. అంతకుముందు రోజు వచ్చిన రూ. 2.45 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 18.4% తక్కువ. గురువారం థియేటర్ ఆక్యుపెన్సీ పరిశీలిస్తే.. తెలుగు వెర్షన్‌కు కేవలం 16.88%, హిందీ వెర్షన్‌కు అత్యంత తక్కువగా 11.21% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది.
తెలుగు రాష్ట్రాల అండతో రూ.322 కోట్ల మార్కు
కలెక్షన్ల వేగం పూర్తిగా మందగించినప్పటికీ, గత రెండు వారాల్లో సాధించిన భారీ వసూళ్ల వల్లే సినిమా ఇప్పటివరకు నిలబడగలిగింది. ఈ సినిమా ఆదాయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయి. 15వ రోజున ఈ రెండు రాష్ట్రాల నుంచి రూ. 1.65 కోట్ల గ్రాస్ రాగా, ఇండియా వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఈ చిత్రం ఇండియాలో రూ. 228 కోట్ల నెట్ సాధించింది. ఓవర్సీస్‌లో రూ. 52.60 కోట్లు రాబట్టడంతో, ప్రపంచవ్యాప్త మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 322.65 కోట్లకు చేరి ఈ ఏడాది చెప్పుకోదగ్గ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ఓపెనింగ్స్ బాగున్నప్పుడే ఇలాంటి మార్పులు చేసుండాల్సింది అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications