ఉన్నట్లుండి కూలిన ఆలయ పైకప్పు- శిథిలాల కింద 20 మంది ? షాకింగ్ వీడియో..!

మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో ఉన్న యశ్వాడి ఆలయంలో ఇవాళ ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతుండగా గర్భాలయం ముందున్న పైకప్పు (temple roof collapse) ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భక్తులపై ఈ కప్పు శిధిలాలు పడిపోయాయి. దీంతో సుమారు 20 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయోధ్య రామాలయంలో విరాళాల గోల్ మాల్ ? యోగీ సర్కార్ సంచలన నిర్ణయం..!
అయోధ్య రామాలయంలో విరాళాల గోల్ మాల్ ? యోగీ సర్కార్ సంచలన నిర్ణయం..!

ఆలయం పైకప్పు కూలిన ఘటనలో భారీగా భక్తులు చిక్కుకుపోయినట్లు తెలియడంతో హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పర్భనీ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఆలయం ఛత్రపతి శంభాజీనగర్ నుండి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వాడి గ్రామంలో ఉంది.

Parbhani Temple Roof Collapse 20 Devotees Feared Trapped 4 confirmed dead

మహిమాన్వితం.. కొల్లూరు మూకాంబికా ఆలయం: మొక్కు తీర్చుకున్న విజయ్
మహిమాన్వితం.. కొల్లూరు మూకాంబికా ఆలయం: మొక్కు తీర్చుకున్న విజయ్

ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆలయ సభా మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులతో పాటు జిల్లా యంత్రాంగం తమ బృందాలను ఘటనా స్థలానికి పంపాయయన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకూ నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. మిగతా వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+