తిరుచానూరు ఆలయంలో అరుదైన అవకాశం

కలియుగ వరదాయిని, జగన్మాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం కోసం దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుచానూరు తరలివస్తుంటారు. అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో, భక్తులు ఈ సేవలకు హాజరయ్యేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవా వేళలను, కీలక మార్గదర్శకాలను వెల్లడించింది.

ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలు..

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజూ భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు నిత్యం రకరకాల సేవలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4:30 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలుపుతారు. శుక్రవారం ఈ సేవ వేకువజామున 3:30 గంటలకే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు సహస్రనామార్చన ఉంటుంది.

Book Arjitha Seva and Feel Spiritual Peace Through TTD Offerings in Tiruchanur Padmavati Temple

ఆలయంలోని నిత్య పూజా విశేషాలు

ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం భక్తులకు కనులపండువగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కుంకుమార్చన, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 9:30 గంటలకు ఏకాంత సేవతో పూజలు పూర్తవుతాయి. శుక్రవారాల్లో ఏకాంత సేవ రాత్రి 9:45 గంటలకు ఉంటుంది.

వారంతపు, నెలవారీ విశేష పూజలు

నిత్య సేవలే కాకుండా వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు అష్టదళ పాదపద్మారాధన, గురువారం తిరుప్పావడ సేవ జరుగుతాయి. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అనంతరం అభిషేకం, ఉదయం 9:30 గంటలకు లక్ష్మీపూజ నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఉదయం 7:30 గంటలకు పుష్పాంజలి సేవ ఉంటుంది. ప్రతి నెలా మొదటి బుధవారం ఉదయం 7 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగుతుంది.

టీటీడీ విస్తరణ- బీహార్ లో భారీ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
టీటీడీ విస్తరణ- బీహార్ లో భారీ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్

వార్షిక, శాశ్వత సేవల వివరాలు

ఆర్జిత సేవలతో పాటు ప్రతి ఏటా మే లో వార్షిక వసంతోత్సవాలు, సెప్టెంబర్ లో పవిత్రోత్సవాలు, నవంబర్ లో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష కుంకుమార్చన, పుష్పయాగం విశేషంగా నిర్వహిస్తారు. ఇక శాశ్వత సేవల్లో భాగంగా నిత్య అర్చన, ఊంజల్ సేవలు జరిపించుకునే సౌకర్యం భక్తులకు ఉంది.

సేవా టికెట్ల బుకింగ్, నిబంధనలు

పద్మావతి అమ్మవారి ఈ దివ్య ఆర్జిత సేవల్లో పాల్గొనాలని భావించే భక్తులు సేవా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆలయ నియమ నిబంధనల ప్రకారం, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాల్సి ఉంటుంది. పురుషులు ధోవతి, పంచె, మహిళలు చీరలు లేదా సాంప్రదాయ సల్వార్ ధరించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+