పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!
పాఠశాలలు.. కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే చర్చ జరిగింది. 21వ తేదీ, 28 తేదీల్లో ఏ రోజు జరుపుకోవాలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, పండితులు 21వ తేదీనే జరుపుకోవాలని స్పష్టత ఇచ్చారు. దీంతో, ప్రభుత్వం ఈ మేరకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించింది.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు (శుక్రవారం) ఏపీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూసివేయనున్నారు. కాగా, తెలంగాణలో మాత్రం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. ఆగస్టు 25న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీలో, 26న తెలంగాణలో ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. అలాగే, ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంది.

శ్రావణ మాసం సందర్భంగా ఈ నెలలో పూజలు, పెళ్లిళ్లకు ప్రత్యేకత ఉంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్ష్మీదేవి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం చేసుకోవటం పైన పండితులు స్పష్టత ఇవ్వటంతో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.
ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్య సంస్థలు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుగా ఖరారైంది. ఇక.. ఇక ఈద్ మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఆగస్టు 25వ తేదీ ఏపీలో, తెలంగాణలో మాత్రం 26వ తేదీ పబ్లిక్ హాలిడేగా ఉన్నాయి. అలాగే 28వ తేదీ రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో హాఫ్ హాలిడే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువగా వచ్చాయి. వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకత ఉంది. మహిళలు పెద్ద సంఖ్య లో భక్తి శ్రద్దలతో ఈ వ్రతం ఆచరిస్తారు. దీంతో.. ప్రభుత్వం ఈ రోజున సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.













Click it and Unblock the Notifications