అయోధ్య జెండాపై పాక్ విమర్శలు..! భారత్ ఘాటు కౌంటర్..!
నిన్న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ చేశారు. దీనిపై పాకిస్తాన్ విమర్శలకు దిగింది. భారత్ లోని మైనార్టీలపై ఒత్తిడి పెంచేందుకే ఇలా జెండా ఆవిష్కరణలు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చేసిన స్థలంలో అయోధ్య రామమందిరం నిర్మించారని, ఇప్పుడు జెండా ఆవిష్కరణలతో ప్రధాని మోడీ ముస్లింలకు హెచ్చరికలు పంపుతున్నారని పాకిస్తాన్ విమర్శలు చేసింది.
దీనిపై భారత్ ఇవాళ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ విమర్శల్ని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ ఇవాళ తోసిపుచ్చారు. మైనార్టీలపై మత వివక్ష మరకల చరిత్ర ఉన్న దేశానికి భారత్ ను విమర్శించే హక్కు లేదని ఆయన తేల్చిచెప్పారు. అసలు పాకిస్తాన్ కు ఇతరుల్ని విమర్శించే నైతిక హక్కే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు మత వివక్ష, అణచివేత , మైనారిటీలపై వ్యవస్థాగత దుర్వినియోగం విషయంలో లోతైన మచ్చల రికార్డు ఉందన్నారు.

తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో... 1992 డిసెంబర్ 6 న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావిస్తూ.. అయోధ్యలో జెండా ఎగురవేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించడానికి భారత్ ప్రయత్నించిందని ఆరోపించింది. దీనిని ఇస్లామోఫోబియా, వారసత్వ అపవిత్రతకు ఉదాహరణగా అభివర్ణించింది. దీనిపై ఇవాళ భారత విదేశాంగశాఖ ఘాటుగా స్పందించింది.

పాకిస్తాన్ భారత్ కు కపట ఉపదేశాలు ఇచ్చే బదులు తన దృష్టిని అంతర్గత వ్వహారాలపై దృష్టిపెట్టాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ సూచించారు. అలాగే పాకిస్తాన్ తమ దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన రికార్డుపై దృష్టి పెట్టడం మంచిదన్నారు. తద్వారా భారత్ చర్యను సమర్ధించుకోవడంతో పాటు పాకిస్తాన్ కు గతం గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications