Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ మాట తప్పారన్న ట్రంప్.. ! భారత్ ఘాటు కౌంటర్..!

ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పరిస్ధితుల్లో భారత్-అమెరికా మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో భారత్ పై 50 శాతం అదనపు సుంకాలు విధించిన ట్రంప్.. మీరు వెనక్కుతగ్గితే తానూ వెనక్కి తగ్గుతానంటూ చెప్పేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రధాని మోడీ నుంచి తనకు హామీ లభించిందని, అయితే మాట తప్పి ఇంకా రష్యా చమురు కొంటూనే ఉన్నారంటూ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. దీనికి భారత్ ఘాటు కౌంటర్ ఇచ్చింది.

భారత్ రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో మాట తప్పిదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగశాఖ ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది. భారత్ అతిపెద్ద చమురు, గ్యాస్ దిగుమతిదారు అని.. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు పరిస్ధితుల నేపథ్యంలో తమ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే తమ ప్రాధాన్యమని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చమురు విధానాలను నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.

India issues strong rebuttal to Trump s pm modi promise claim on Russian oil purchases

స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన చమురు సరఫరాను కొనసాగించడం తమ ఇంధన విధానం యొక్క జంట లక్ష్యాలని జైశ్వాల్ వెల్లడించారు. ఇందులో తమ ఇంధన వనరులను విస్తృతంగా సేకరించడం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వైవిధ్యపరచడం ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా విషయానికొస్తే తాము చాలా సంవత్సరాలుగా తమ ఇంధన సేకరణను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత దశాబ్దంలో ఇది క్రమంగా పురోగమిస్తోందన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారతదేశంతో ఇంధన సహకారాన్ని మరింతగా పెంచుకోవడంలో ఆసక్తి చూపిందని, చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించారు.

India issues strong rebuttal to Trump s pm modi promise claim on Russian oil purchases

అంతకు ముందు ట్రంప్ .. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఉండవని ఆయన తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. దీన్ని మోడీ వెంటనే చేయలేరని, ఇదో చిన్న ప్రక్రియ, ఇది త్వరలోనే జరిగి తీరుతుందని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఇవాళ కౌంటర్ ఇచ్చింది. రష్యా చమురు కొనుగోళ్లు ఆగబోవని తేల్చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+