lockdown:పేదల కోసం రూ.65 వేల కోట్లు, రాహుల్ గాంధీతో రఘురాం రాజన్ ఏం చెప్పారంటే...?
లాక్‌డౌన్ వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకునేందుకు దేశానికి రూ.65 వేల కోట్లు కావాలని మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్ధికవేత్త రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. పేదల కోసం వెచ్చించే మొత్తం ఎక్కువ కాదు అని.. ఆ నగదుతో పేదల ప్రాణాలను కాపాడొచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రఘురాం రాజన్ ఇంటరాక్ట్ అయ్యారు. వారిద్దరూ మాట్లాడిన అంశాలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. రఘురాం రాజన్ లింక్ డిన్‌లో పోస్ట్ చేశారు.
లాక్‌డౌన్ ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి సద్దుమణిగితే ఎత్తివేయడమే మేలు అని తెలిపారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో పేదలకు రేషన్, నగదును ప్రభుత్వం అందించలేదు అని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ఎంతమొత్తంలో నగదు అవసరం అవుతుంది అని రాహుల్ గాంధీ రఘురాం రాజన్‌ను అడగగా.. రూ.65 వేల కోట్ల అవసరం అవుతాయని తెలిపారు.

Recommended Video
కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి దూరమయ్యాక దేశంలోని పేదల సమస్య గురించి ఆర్థికవేత్త రఘురాం రాజన్ రాహుల్ గాంధీ తొలిసారి సమావేశమయ్యారు. తర్వాత మేధావులతో కూడా ఇంటరాక్ట్ అవుతారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ సమస్యలపై 11 మంది సభ్యులతో కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసింది. దీనికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు.












Click it and Unblock the Notifications