Exit Poll India News-D Dynamics: ఎన్డీయే, ఇండియా కూటమి పోరులో జరిగిందిదే..!

దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఇండియా న్యూస్- డీ డైనమిక్స్ తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఇందులో విపక్ష ఇండియా కూటమిపై అధికార ఎన్డీయే కూటమి స్పష్టమైన అధిక్యం సాధించినట్లు తెలిపింది. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల్లో ఇరు కూటములూ ఎన్ని సీట్లు సాధించబోతున్నాయో గణాంకాలతో సహా వెల్లడించింది. దీంతో ఈసారి కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తేలిపోయింది.

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీయే కూటమి ఏకంగా 371 సీట్లు సాధించబోతున్నట్లు తేల్చారు. అలాగే విపక్ష ఇండియా కూటమి మాత్రం కేవలం 125 సీట్లకు పరిమితం కాబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న చాలా పార్టీలు గతంలో తాము సాధించిన సీట్లను కోల్పోతున్నట్లు తేలింది. ఈ ఎగ్జిట్ పోల్ వాస్తవమైతే మాత్రం ఇండియా కూటమికి భవిష్యత్తులో కష్టాలు తప్పేలా లేవు.

india news-d dynamics exit poll predicts 371 seats to nda 125 to india bloc and 47 to others

అలాగే ఎన్డీయే కూటమి కీలకమైన ఏపీ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుకున్న పొత్తులు, అలాగే కర్నాటక వంటి అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో సాధించిన సీట్లు ఈసారి బీజేపీకి హ్యాట్రిక్ అధికారం ఇప్పించబోతున్నట్లు తేలింది. అలాగే యూపీ వంటి పెద్ద రాష్టాల్లోనూ తాము గతంలో సాధించిన సీట్లు కాషాయ పార్టీ నిలబెట్టుకుంటున్నట్లు ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+