పాక్‌ను ఏకాకిని చేసిన కేంద్ర ప్రభుత్వం- ఐరాస సైతం హెల్ప్ లెస్
India Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది.
తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.

ఈ దాడుల గురించి అన్ని మిత్ర దేశాలకు సమాచారం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌పై ఎందుకు మిస్సైళ్ల దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.
అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, తజకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ప్.. వంటి దేశాలతో సంప్రదింపులు జరిపింది. తాజాగా ఐక్యరాజ్యసమితితోనూ మాట్లాడింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఐరాస భద్రత మండలికి ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో సభ్య దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనాతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధితో పాటు ఐరాసలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్.. ఈ విషయాలతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరి గురించి వివరించారు. పాకిస్తాన్ భూభాగంపై ఉగ్రవాద క్యాంపులు కొనసాగుతున్నాయంటూ సాక్ష్యాలను అందజేశారు.
అలాగే- భద్రత మండల నాన్ పర్మనెంట్ మెంబర్స్ దేశాలు- అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పనామా, దక్షిణ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా, సోమాలియా దేశాలకూ ఈ దాడుల గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. ఆయా దేశాల నుంచి సంపూర్ణ మద్దతు కోరారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications