వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Death In India: రికార్డు స్థాయిలో మరణాలు-ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యధికం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా రికార్డు స్థాయిలో 6148 మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలివే. ప్రపంచంలోనే మరే దేశంలోనూ ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమెరికాలో నమోదైన 5444 మరణాలే ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు. భారత్‌లో తాజాగా నమోదైన భారీ మరణాలతో ఆ రికార్డు బ్రేక్ అయినట్లయింది.

Recommended Video

Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu

తాజా కోవిడ్ మరణాలతో కలిపి ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,59,676కి చేరింది. కొత్తగా మరో 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 29,183,121కి చేరింది. కోవిడ్ కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు లక్షకు దిగువనే నమోదవడం గమనార్హం.

 India records world’s highest daily COVID-19 deaths since beginning of COVID-19 pandemic

మరో 1,51,367 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 2,76,55,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 25 రోజులకు పైగా దేశంలో కొత్త కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.77శాతానికి పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 4.69శాతం,వీక్లీ పాజిటివిటీ రేటు 5.43శాతంగా ఉంది. వరుసగా గత 17 రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువే నమోదవుతోంది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తమిళనాడులో 17,321 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 15,204,మహారాష్ట్రలో 10,989,కర్ణాటకలో 10,959,ఆంధ్రప్రదేశ్‌లో 8,766,ఢిల్లీలో 337,పశ్చిమ బెంగాల్‌లో 5384 కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సినేషన్ విషయానికి వస్తే... దేశవ్యాప్తంగా బుధవారం(జూన్ 9) నాటికి 24 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. బుధవారం 18-44 ఏళ్ల వయసు కేటగిరీలో 19,24,924 మందికి తొలి డోసు,మరో 86,450 మందికి రెండో డోసు ఇచ్చారు. ఇప్పటివరకూ 18-44 ఏళ్ల కేటగిరీలో 3,38,08,845 మందికి తొలి డోసు, 4,05,114 మందికి రెండో డోసు ఇచ్చారు. ఇందులో హెల్త్‌కేర్ వర్కర్లు 1,00,12,624 మంది తొలి డోసు, 69,11,311 మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,64,71,228 మంది తొలి డోసు, 87,51,277 మంది రెండో డోసు తీసుకున్నారు. 45-60 ఏళ్ల కేటగిరీలో 7,33,23,267 మందికి తొలి డోసు, 1,16,22,718 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన కేటగిరీలో 6,16,38,580 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,95,34,203 లబ్ధిదారులు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

English summary
India's daily Covid-19 cases remained below the 100,000 again today, however, the daily death record saw a massive spike. The country reported 94,052 new infections today and 6,148 new deaths, taking the total number of confirmed infections in India to 29,183,121 and deaths to 359,676,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X