Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

India: భారత పోర్టుల నుంచి ఇరాన్ పై అమెరికా దాడులు? తేల్చేసిన కేంద్రం..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)సంయుక్త దాడుల్ని ఆరంభించి ఆరు రోజులవుతోంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ సహా మొత్తం టాప్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశామని చెప్పుకున్న అమెరికా-ఇజ్రాయెల్ .. ఇప్పుడు ఈ వార్ ఎన్ని రోజులు కొనసాగుతుంందో చెప్పలేని పరిస్ధితికి వచ్చేశాయి. మరోవైపు ఇరు దేశాల ఆయుధాగారాలు నిండుకోవడం ప్రారంభించాయి. అదే సమయంలో ఇరాన్ వార్ ను సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు చుట్టుపక్కల దేశాల సాయాన్ని ఇవి తీసుకుంటున్నాయి.

భారత్ వరకూ వచ్చేసిన వార్ ? తీరంలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా..!
భారత్ వరకూ వచ్చేసిన వార్ ? తీరంలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా..!

ఇదే క్రమంలో భారత్ (india)లోని పోర్టుల నుంచి కూడా అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తోందంటూ యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రెగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో ఆయన.. మా బేస్ లు, పోర్టులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మేం భారత పోర్టులపై నుంచి ఇరాన్ పై దాడులు చేయాల్సి వస్తోందన్నారు. ఇది సరికాదన్నారు. నేవీ చెప్పేదీ అదే అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికన్ ఆర్మీ మాజీ కల్నల్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

India Rejects Report Amid US-Iran Tensions Denies Port Use for Strikes

ఇరాన్ వార్ పై ట్రంప్ వర్సెస్ ట్రంప్..! పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?
ఇరాన్ వార్ పై ట్రంప్ వర్సెస్ ట్రంప్..! పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?

అసలే నిన్న భారత్ నుంచి తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకను శ్రీలంక సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత పోర్టుల్ని ఇరాన్ పై దాడులకు అమెరికా వాడుతుందన్న వాదన మరింత బలపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని తేల్చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check)లో వీటికి కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి ఆరోపణలపై అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరింది. మధ్యప్రాచ్యంలో సంఘర్షణపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచకుండా ఉండాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+