కరోనా తీవ్రత తగ్గుముఖం - తాజాగా 58,077 పాజిటివ్ కేసులు : 97.17 శాతం రికవరీ రేటు..!!
దేశ వ్యాప్తంగా కరోనా గణనీయంగా తగ్గింది. కేసుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. గత నెలలో మూడు లక్షల పైగా నమోదైన కేసులు..ప్రస్తుం లక్షకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14,91,678 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతం రోజు కంటే అది 13.4 శాతం తక్కువగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, 657 మరణాలు నమోదైనట్లు ప్రకటించారు. దీంతో..దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,25,36,137 గా నిర్దారించారు.
గత 24 గంటల్లో మొత్తం 1,50,407 మంది కోలుకున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,13,31,158 మంది కరోనా నుంచి బయట పడ్డారు. ఇక, రికవరీ రేటు 97.17 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 92,987 గా ప్రకటించారు. కేరళలో 18,420 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 6,248 కేసులు రిజిస్టర్ అయ్యాయి.

కర్ణాటకలో 5,019 పాజిటివ్ కేసులు.. తమిళ నాడు లో 3,592 , ఇక రాజస్థాన్ లో 3,491 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. ఈ అయిదు రాష్ట్రాల్లోనే 63.31 శాతం పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. అందులో కేరళలోనే 31.72 శాతం గా నమోదైంది. దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 5,07,177 గా నిర్దారించారు. కేరళలో 341, మహారాష్ట్రలో 45 మరణాలు నమోదయ్యాయి.
ఇక, గత 24 గంటల్లో 48,18,867 మందికి వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటి వరకు మొత్తంగా 1,71,79,51,432 వ్యాక్సిన్ల పంపిణీ పూర్తి చేసారు. ఇక,ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 24,18,983 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10,862 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 40.63 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,08,798కు చేరింది. అమెరికాలో ఒక్కరోజే 1,79,237 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 2,465 మంది మృతిచెందారు.రష్యాలో కొత్తగా 1,97,076 మందికి కరోనా సోకింది. 701 మంది మరణించారు. జర్మనీలో మరో 2,47,128 మంది వైరస్ బారినపడ్డారు. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications