కరోనా కేసులు మూడు లక్షలను దాటేశాయ్: మరణాల్లోనూ భారీ పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గట్లేదు. భయపడ్డట్టే సంక్రాంతి పండగ సీజన్ ముగిసిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసింది. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాలు వీకెండ్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం కలవరపాటుకు గురి చేస్తోంది.
అటు ఒమిక్రాన్ వేరియంట్ రోజువారీ కేసుల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంది. వాటి సంఖ్య 10 వేలకు చేరువైంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..24 గంటల వ్యవధిలో కొత్తగా 3,17,532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 491 మంది మరణించారు. 2,23,990 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773కు చేరింది. 4,86,066 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు.

యాక్టివ్ కేసులు అమాంతం పెరిగాయి. 20 లక్షలకు చేరువ అయ్యాయి. యాక్టివ్ కేసులు 19,24,051గా రికార్డయ్యాయి. పాజిటివిటీ రేటు 16.14 శాతంగా నమోదైంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తంగా 159,67,55,879 డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. బుధవారం ఒక్కరోజే 73,38,592 డోసుల టీకాలు వినియోగమైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 10 వేలకు చేరువ అయ్యాయి. ఇప్పటిదాకా 9,287 కేసులు రికార్డయ్యాయి. కరోనా వైరస్ అత్యధిక సంఖ్యలో నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. మహారాష్ట్రలో 43,697, కర్ణాటక-40,499, కేరళ-34,199, తమిళనాడు-23,888 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు తగ్గట్టుగా కరోనా మరణాలు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. కొత్తగా 419 మంది మరణించారు.












Click it and Unblock the Notifications