ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన-పాక్ మంత్రి బిలావల్ భుట్టోపై భారత్ ఫైర్-నిరాధారం, రాజకీయ కామెంట్లే..
కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లేవనెత్తిన పాకిస్తాన్ విదేశామంత్రి బిలావల్ భుట్టో చర్యపై స్పందించడం కూడా అనవసరమని భారత్ వ్యాఖ్యానించింది.
తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి యూఎన్ఎస్సీ(UNSC) భేటీలో పాకిస్తాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal bhutto zardari)పై భారత్ తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఐరాసలో మహిళలు, శాంతి, భద్రతపై జరుగుతున్న భేటీలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావడమేంటని ప్రశ్నించింది. భుట్టో తీరు దురుద్దేశపూర్వకమని, రాజకీయ ప్రేరేపితమని ధ్వజమెత్తింది.
భుట్టో కామెంట్స్ పై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ స్పందించారు. భుట్టో ఆరోపణలు నిరాధారం, రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి పాకిస్తాన్ ప్రతినిధి చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను తాను కొట్టిపారేస్తున్నట్లు రుచిరా జాతీయ వార్తా సంస్ధ పీటీఐకి తెలిపారు. అంతకు ముందు ఐరాసలోనే వీటిపై మాట్లాడుతూ.. ఈ దురుద్దేశపూరితమైన, నిరాధార ఆరోపణలపై స్పందించడం కూడా అనవసరమని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి అంశాలపై స్పందించే బదులు తమ దృష్టి సానుకూల అంశాలపై, భవిష్యత్తుపైనే ఉంటుందని పాక్ మంత్రి ప్రసంగాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలు, శాంతి, భద్రత ఎజెండా అమలును వేగవంతం చేయడానికి తాము చేసే సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఇవాళ్టి చర్చ చాలా ముఖ్యమైందిగా భావిస్తున్నామన్నారు. తాము ఈ చర్చ యొక్క అజెండాను గౌరవిస్తామని, సమయ ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తామని, కాబట్టి మా దృష్టి ఈ అంశంపైనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications