చమురు వేట: రంగంలోకి ONGC, కృష్ణ-గోదావరి నుంచి అండమాన్ వరకు..

ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ తన చమురు అన్వేషణను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ (ONGC) సుమారు 18 నుంచి 20 బిలియన్ డాలర్ల భారీ వ్యయంతో లోతైన సముద్ర గర్భంలో డ్రిల్లింగ్ చేసేందుకు ప్రపంచవ్యాప్త టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్ల కాల పరిమితితో అత్యాధునిక డ్రిల్‌షిప్‌లు, సెమీ-సబ్ మెర్సిబుల్ రిగ్‌లను అద్దెకు తీసుకోవడమే ఈ టెండర్ ప్రధాన ఉద్దేశం.

ఓఎన్‌జీసీ తన అన్వేషణ ప్రణాళికను కేవలం పాత బేసిన్‌లకే పరిమితం చేయకుండా, కొత్త సరిహద్దులను వెతుకుతోంది. ప్రస్తుతం చమురు ఉత్పత్తి అవుతున్న కృష్ణ-గోదావరి (KG) బేసిన్‌లో కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో పాటు, ఇప్పటివరకు పెద్దగా అన్వేషించని అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోని అత్యంత లోతైన జలాలపై దృష్టి సారించింది.

India Secures Energy Future ONGC Eyes Global Partnerships for Drilling While Ramping Up Russian Oil Imports

ఈ ప్రాజెక్టులోని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ చమురు దిగ్గజాలైన ఎక్సాన్‌మొబిల్, బీపీ, టోటల్ ఎనర్జీస్, పెట్రోబ్రాస్‌ల సహకారాన్ని ఓఎన్‌జీసీ కోరుతోంది. ముంబైలో జరిగిన ప్రీ-బిడ్ సమావేశానికి ఇప్పటికే డజనుకు పైగా అంతర్జాతీయ సంస్థలు హాజరవ్వడం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

రష్యా చమురుపై పెరిగిన మొగ్గు..

ఒకవైపు స్వదేశీ అన్వేషణ జరుగుతుండగానే, మరోవైపు తక్షణ అవసరాల కోసం భారత్ రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరియు హార్ముజ్ జలసంధి వద్ద అంతరాయాల కారణంగా ప్రపంచ సరఫరా తగ్గడంతో, భారత రిఫైనరీలు ఏప్రిల్ డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురును కొనుగోలు చేశాయి. ఇది ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కావడం గమనార్హం. అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులు కూడా రష్యా నుంచి చమురు సేకరణ పెరగడానికి మార్గం సుగమం చేశాయి.

ధరల సెగ.. ఇంధన భద్రతే లక్ష్యం..

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో సరఫరా కొరత ఉండటంతో, రష్యా చమురు కొనుగోళ్లు బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు $5-15 ప్రీమియంతో జరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ధరల సెగ తగులుతున్నా, దేశీయంగా ఇంధన నిల్వలను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. సాగర గర్భంలో ఓఎన్‌జీసీ చేపట్టే ఈ భారీ అన్వేషణ విజయవంతమైతే, భవిష్యత్తులో దేశీయ చమురు ఉత్పత్తి గణనీయంగా పెరిగి, విదేశీ దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+