అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు!

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధిలో నెలకున్న అనిశ్చితి నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు 'మాస్టర్ ప్లాన్' అమలు చేస్తోంది. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో, రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటూ దేశీయ అవసరాలకు ఎటువంటి డోకా లేకుండా చర్యలు చేపట్టింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ డెలివరీ కోసం భారత్ సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఇది ఫిబ్రవరి నెల దిగుమతుల కంటే రెట్టింపు కావడం గమనార్హం. పశ్చిమ ఆసియాలోని ట్యాంకర్ల రాకపోకలు అస్థిరంగా మారడంతో, సరఫరా కొరత రాకుండా ఉండేందుకు రష్యా నుంచి బ్రెంట్ ధరపై బ్యారెల్‌కు $5 నుంచి $15 ప్రీమియం చెల్లించి మరీ ఈ ఆర్డర్లు ఇచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల నుంచి లభించిన మినహాయింపులు కూడా ఈ డీల్స్ వేగవంతం కావడానికి తోడ్పడ్డాయి.

India Secures Energy Supply Buys 60 Million Barrels of Russian Crude Amid West Asia Crisis and Hormuz Delays

మారుతున్న సమీకరణాలు.. వెనిజులా వైపు కూడా చూపు

గత డిసెంబర్ నుంచి సౌదీ అరేబియా, ఇరాక్ వైపు మొగ్గు చూపిన భారతీయ రిఫైనరీలు (మంగళూరు రిఫైనరీ, హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటివి), పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల వల్ల అక్కడ కార్గోలు ఆలస్యం కావడంతో మళ్లీ రష్యా వైపు మళ్లాయి. అయితే, కేవలం రష్యాపైనే ఆధారపడకుండా భారత్ తన సరఫరాదారుల జాబితాను విస్తరిస్తోంది. ఏప్రిల్‌లో వెనిజులా నుంచి దాదాపు 8 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇది 2020 తర్వాత అత్యధికం కావడం విశేషం. ఏ ఒక్క ప్రాంతంపై అతిగా ఆధారపడకుండా భౌగోళిక రాజకీయ నష్టాలను తగ్గించుకోవడమే ఈ వ్యూహంలోని ప్రధాన ఉద్దేశ్యం.

పుకార్లకు తావులేదు.. నిల్వలు పుష్కలం

ఒకవైపు అంతర్జాతీయంగా చమురు రాజకీయాలు నడుస్తుంటే, మరోవైపు దేశీయంగా ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల ప్రస్తుత కాలపరిమితి యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

బీపీసీఎల్ (BPCL) భరోసా

పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వెల్లడించింది. సరఫరా వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ప్రభుత్వ వ్యూహాత్మక కొనుగోళ్ల వల్ల దేశంలో ఇంధన లభ్యతకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+