తొలిసారి విదేశాలకు మన కరోనా వ్యాక్సిన్- మాల్దీవులు, భూటాన్‌లకు కోవిషీల్డ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను విజయవంతంగా అమల్లోకి తెచ్చిన దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు క్రమంగా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఎగుమతులు ప్రారంభించింది. అయితే ముందుగా భారత ఉపఖండంలోని పొరుగు దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను పంపుతున్నారు. తొలి విడతగా భూటాన్, మాల్దీవులకు భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపారు.
Recommended Video
పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను భూటాన్, మాల్దీవులకు ఇవాళ ఎగుమతి చేశారు. భూటాన్‌కు ట్రక్కులతో పాటు విమానాల ద్వారా పూణే నుంచి ఈ డోసులు పంపారు. మాల్దీవులతో పాటు భూటాన్‌కు మరికొన్ని డోసులను విమానాల్లో పంపుతున్నారు. పొరుగుదేశాలకు ప్రాధాన్యమిచ్చే భారత విదేశాంగ విధానంలో భాగంగా ఉపఖండంలోని అన్ని దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులు పంపబోతున్నారు.

ఇవాళ భూటాన్, మాల్దీవులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వెళ్లాయి. రేపటి నుంచి పొరుగున ఉన్న ఇతర దేశాలు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సియాషెల్స్‌కు కూడా పంపాలని కేంద్రం నిర్ణయించింది. పాకిస్తాన్‌కు పంపాలా వద్దా అన్న దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్‌కు కూడా పంపితే భారత్ ఉపఖండంలోని అన్ని దేశాలకు మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పంపినట్లవుతుంది. పొరుగున ఉన్న చైనా ఉపఖండంలో దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణమైతే బారత్ మాత్రం వ్యాక్సిన్లు పంపి ఆదుకోవడం విశేషం.

-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications