2047 నాటికి అవినీతి, పేదరికం రహిత దేశంగా భారత్: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటోంది. దేశం నలుమూలలా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. తెల్లవారు జాము నుంచే పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశ రాజధానిలోని ఎర్రకోటను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని రెడ్‌ఫోర్ట్‌పై ఎగురవేస్తారు. కరోనా ముప్పు ఇంకా వీడనందున పరిమితంగా ఎర్రకోటలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానితులు హాజరు కానున్నారు.
ఇంకాస్సేపట్లో ప్రధాని మువ్వన్నెల పతాకాన్ని ఎగుర వేయాల్సి ఉన్నందున.. అక్కడి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అడుగడుగునా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. కాగా- కేంద్ర పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి.. తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

75వ ప్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రజలు దీన్ని విజయవంతం చేయాలని విజ్ఙప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతిని సాధిస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తోన్న అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
Union Minister for Culture & Tourism G Kishan Reddy hoists national flag at his residence on India's 75th #IndependenceDay
— ANI (@ANI) August 15, 2021
"Many events will take place across nation during 'Azadi ka Amrit Mahotsav' celebrations. India should become corruption-free, poverty-free by 2047,"he says pic.twitter.com/BAaWN8Ycdd
2047 నాటికి దేశాన్ని అవినీతి, పేదరిక రహితంగా తీర్చిదిద్దాలని సంకల్పించామని అన్నారు. ఈ దిశగా పలు చర్యలను తీసుకుంటున్నామని జీ కిషన్ రెడ్డి అన్నారు. అవినీతి రహిత దేశంగా మార్చడానికి డిజిటల్ ఇండియా ఉపకరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని రూపుమాపేలా దేశ ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. మరోవంక- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video
Defence Minister Rajnath Singh hoists the national flag on the 75th #IndependenceDay at his residence in Delhi pic.twitter.com/Uql4S1r3gD
— ANI (@ANI) August 15, 2021












Click it and Unblock the Notifications